Pori Moni: Bidya Sinha Mim Your Intimacy With Razz is Destroying Our Married Life - Sakshi
Sakshi News home page

Pori Moni: నా భర్తే దొరికాడా, నా కాపురంలో నిప్పులు పోయకు.. హీరోయిన్‌కు వార్నింగ్‌

Nov 11 2022 8:00 PM | Updated on Nov 12 2022 10:46 AM

Pori Moni: Bidya Sinha Mim Your Intimacy With Razz is Destroying Our Married Life - Sakshi

మీరు లైన్‌ క్రాస్‌ చేస్తున్నారు. మీ ఇద్దరి బాగోతం వల్ల నా జీవితం నాశనమవడమే కాకుండా పిల్లాడి లైఫ్‌ కూడా దెబ్బ తింటుంది. అది అడ్డుపెట్టుకుని నా జీవితాన్ని నరకంగా మార్చుతున్నావు. మీరిద్దరు రాత్రిళ్లు ఫోన్‌లో మాట్లాడుకోవడం, చాట్‌ చేయడం నాకు తెలుసు.

బెంగాలీ నటిమణులు పొరి మొని, బిడ్యా సిన్హ మిమ్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తన సక్సెస్‌ చూసి కుళ్లుకుంటున్నావని ఒకరు, నీకంత సీన్‌ లేదని మరొకరు సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇంతకీ వీరి మధ్య గొడవేంటో చూద్దాం..

ఈ మధ్యే 'దమాల్‌' అనే బంగ్లాదేశ్‌ పీరియాడికల్‌ చిత్రం రిలీజైంది. రైహాన్‌ రఫి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో బిద్య సిన్హ సాహ మిమ్‌, సరిపుల్‌ రాజ్‌, సియామ్‌ అహ్మద్‌, షహనాజ్‌ సుమీ ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు సరిపుల్‌ రాజ్‌ భార్యే నటి పొరి మొని. సినిమా ప్రమోషన్స్‌లో హీరో సియామ్‌ అహ్మద్‌, హీరోయిన్‌ బిద్య సిన్హ క్లోజ్‌గా కనిపించడాన్ని తట్టుకోలేకపోయింది పొరి మొని. ఆమెకు నా భర్తే దొరికాడా అని రగిలిపోయింది. దీంతో తన ఫేస్‌బుక్‌లో.. నీ భర్తతో కలిసి పాపులర్‌ అయ్యేందుకు ప్రయత్నించు అంటూ పరోక్షంగా బిద్య సిన్హకు చురకలు వేసింది. దీనిపై మిమ్‌ స్పందిస్తూ.. కొందరు నా విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని కౌంటరిచ్చింది.

దానికి బదులుగా పొరి మొని ఫేస్‌బుక్‌లో దీర్ఘ లేఖను పోస్ట్‌ చేసింది. 'మీ అందరికీ కొన్ని విషయాలను తేటతెల్లం చేయాలనుకుంటున్నాను. మిమ్‌.. ఏమన్నావు? నీ సక్సెస్‌ చూసి కుళ్లుకుంటున్నానా? ఎవరో తెలియని వారు ఇలా అన్నారంటే ఓకే, కానీ ఈ మాట నువ్వెలా అనగలుగుతున్నావు. పోరన్‌ సినిమాలో సరిఫుల్‌, నువ్వు జంటగా బాగున్నారని, మీరు మరిన్ని సినిమాలు చేయాలని నేనే కదా ఎన్నోసార్లు చెప్పాను. మీ అమ్మతో కూడా ఇదే మాట అన్నాను. ఇంతలోనే ఎలా మర్చిపోయావు?

కానీ మీరు లైన్‌ క్రాస్‌ చేస్తున్నారు. మీ ఇద్దరి బాగోతం వల్ల నా జీవితం నాశనమవడమే కాకుండా పిల్లాడి లైఫ్‌ కూడా దెబ్బ తింటుంది. రాజ్‌.. నువ్వు దమాల్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నావని తెలుసు. కానీ అది అడ్డుపెట్టుకుని నా జీవితాన్ని నరకంగా మార్చుతున్నావు. మీరిద్దరు రాత్రిళ్లు ఫోన్‌లో మాట్లాడుకోవడం, చాట్‌ చేయడం నాకు తెలుసు. అది ప్రమోషన్స్‌ కోసమో, సినిమా విషయాలో అని చెప్పి దాన్ని దాటవేస్తారనీ తెలుసు. కానీ అలా అర్ధరాత్రి ఫోన్‌ మాట్లాడుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇక దీన్ని ఆపేయండి' అని రాసుకొచ్చింది పొరి మొని.
చదవండి: నటిపై లైంగిక వేధింపుల కేసు
నేనే తోపు అంటూ నన్ను మునగ చెట్టెక్కించారు, చివరకు.. : గీతూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement