గోడకు కొట్టిన బంతి రెట్టింపు వేగంతో తిరిగి వచ్చినట్లు.. మొదటి సినిమాతో బోల్తా కొట్టినా రెట్టింపు వేగంతో తిరిగి వచ్చి, వరుస వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న స్టార్ స్నేహా పాల్. ఆమె పరిచయమే ఇది...
స్నేహా పాల్.. కోల్‌కతాకు చెందిన మోడల్. చిన్నప్పుడు చదువు కన్నా ఆటపాటల్లో చురుగ్గా ఉండేది. అందులోనూ డాన్స్ అంటే మరీనూ. కొంతకాలం శాస్త్రీయ నాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. ఆ నాట్యమే ఆమెను వెండితెరకు పరిచయం చేసింది. మొదటిసారి ‘డ్రీమ్‌గర్ల్’ అనే కన్నడ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించి ప్రేక్షకుల దృష్టిలో పడింది. కానీ డ్రీమ్‌గర్ల్‌లోని ఆ సాంగ్ తన డ్రీమ్‌ను నెరవేర్చలేకపోయింది. అభినయకౌశలంతో మెప్పించినా అవకాశాలు ఏవీ ఆమె దరిచేరలేదు.
మోడల్‌గా కనిపించినా సరైన గుర్తింపు రాలేదు. దాంతో కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. దేశాన్ని చుట్టొచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆ టూరే ఆమెను మళ్లీ ఇండస్ట్రీలోకి యూటర్న్ తీసుకొనేలా చేసింది. ముంబైలో తనని చూసిన ఓ టెక్నీషియన్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ సిరీసే ‘ది సిటీ అండ్ ఏ గర్ల్’. అది స్నేహాకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. తర్వాత పలు యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ‘చర్మ్‌సుఖ్ చాల్ హౌస్’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.
కెరీర్ ప్రారంభంలోనే బోల్డ్ పాత్రల్లో కనిపిస్తే వాటికే పరిమితం చేస్తారని చాలామంది చెప్పారు. కానీ, నటిగా ఎదగాలంటే ఎలాంటి పాత్రనైనా పోషించాలి.
– స్నేహాపాల్
Comments
Please login to add a commentAdd a comment