నేనో పుస్తకాల పురుగును : హుమా ఖురేషీ
నేనో పుస్తకాల పురుగును : హుమా ఖురేషీ
Published Wed, Aug 14 2013 11:50 PM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
న్యూఢిల్లీ: చలువ కళ్లద్దాలు పెట్టుకొని మోడ్రన్ మోడల్‌గా కనిపిస్తున్న ఈ అమ్మడు ఒకప్పుడు పుస్తకాల పురుగట. ఈమెకు అందంపై అసలు ఆసక్తే ఉండేది కాదట. పాఠశాల రోజుల్లోనేకాదు కళాశాలకు వెళ్లిన రోజుల్లో కూడా ఈమె సాదాసీదాగానే వెళ్లేదట. మరి ఇంతలో అంత మార్పు ఎలా వచ్చిందబ్బా... అనే ప్రశ్నను హుమా ఖురేషీని అడిగితే ఇలా చెప్పింది....
‘మీరు విన్నది నిజమే. చిన్నప్పటి నుంచి నేనో పుస్తకాల పురుగును. పుస్తకాలంటే నాకెంతో ఇష్టం. ఆ ఇష్టమే నన్ను క్లాస్ ఫస్ట్‌గా నిలబెట్టేది. అయితే మారుతున్న రోజులకు అనుగుణంగా డ్రెస్‌లు వేసుకోవడం, అందంగా ముస్తాబు కావడంపై నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడిలా కనిపిస్తున్నా కళాశాలకు వెళ్లేదాకా మా నాన్న దుస్తులనే వేసుకునేదానిని. ఇప్పటికీ నా దగ్గర డ్రెస్సుల కంటే పుస్తకాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రముఖులు రాసే స్వీయచరిత్రలు చదివేందుకు ఎక్కువగా ఇష్టపడేదానిని. జీవిత కథలన్నా ఇష్టమే. అవే నాలో చాలా మార్పు తీసుకొచ్చాయి.
కీడాకారులైనా, కళాకారులైనా, వ్యాపారవేత్తలైనా కొనసాగుతున్న రంగంలో రాణించాలంటే ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినవారి జీవిత చరిత్రలను తప్పక చదవాలి. అందులో ఏదో ఓ పుస్తకంలో మనల్ని ఉత్తేజితుల్ని చేసే, మనలో స్ఫూర్తి నింపే అంశాలు తప్పకుండా ఉంటాయి.
ఉన్నత శిఖరాలను అధిరోహించినవారి జీవిత చరిత్రలు చదివితే దాదాపు అందరి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలు ఒకేలా ఉంటాయి. చిన్నప్పుడు పడిన కష్టాలే వారిని రాటుదేలుస్తాయి. అయితే నాలో ఈ మార్పు రావడానికి కారణం పుస్తకాలే. ఇక గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ చిత్రం తర్వాత నాలో మరింత మార్పొచ్చింది. ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ చిత్రం ‘దేఢ్ ఇష్కియా’ చిత్రంలో నటిస్తున్నాన’ని చెప్పింది.
Advertisement
Advertisement