
విక్టరీ వెంకటేశ్, హ్యూమా ఖురేషీ
‘కాలా’ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఒప్పుకున్నారో కానీ తమిళంలో కాలు పెట్టాక తెలుగులో కాలు పెట్టే అవకాశం వచ్చింది హ్యూమా ఖురేషీకి. మరి... రజనీకాంత్ ‘కాలా’ విడుదలయ్యాక ఈ బ్యూటీ సౌత్‌లో ఫుల్ బిజీ అవుతారేమో కాలమే చెప్పాలి. ఈ 7న విడుదల కానున్న ‘కాలా’ కోసం హ్యూమా వెయిటింగ్ అట. ప్రస్తుతం తెలుగులో ఆమెను వరించిన ఆçఫర్ విషయానికొస్తే... విక్టరీ వెంకటేశ్‌తో హ్యూమా జోడీ కట్టనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వెంకీ ‘గురు’ సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది.
ఏడాది గ్యాప్ తీసుకోవడం వల్లనో ఏమో ఆయన స్పీడ్ పెంచారు. ప్రస్తుతం వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిలోబాబీ దర్శక త్వంలో చేయనున్న సినిమా ఒకటి. ఇందులో వెంకీ– నాగచైతన్య మామా అల్లుళ్లగా కనిపించ నున్నారు. వెంకీ సరసన బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీని నాయికగా తీసుకోవా లనుకున్నా రట. హ్యూమాతో చర్చించా రని సమాచారం. ఇది కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రం చేయనున్నారు వెంకటేశ్. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరో. వెంకీకి జోడీగా తమన్నా కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment