
మళ్లీ అదరగొట్టిన అక్కీ.. దుమ్మురేపుతున్న ట్రైలర్!
బాలీవుడ్ సూపర్ స్టార్‌లలో అక్షయ్ కుమార్ స్టైలే వేరు. వీరోచితమైన యాక్షన్‌తోనే కాదు.. మంచి టైమింగ్‌తో కూడిన కామెడీతోనూ అతను ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలడు. 2016లో హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటిన ఈ సూపర్‌స్టార్ 2017లో లాయర్‌గా ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. 'జాలీ ఎల్‌ఎల్‌బీ-2'గా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైంది.
ఇటు ఫర్ఫెక్ట్ కామెడీనే కాదు.. అటు ఉత్కంఠరేపే కోర్టురూమ్ సీన్లు, యాక్షన్ కలయికగా ఈ సినిమా ఉండనుందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. సూపర్‌హిట్ అయిన 'జాలీ ఎల్‌ఎల్‌బీ' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌కు జోడీగా హ్యుమా ఖురేషీ నటించింది. సుభాష్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లాయర్‌గా అక్షయ్ తనదైన మార్క్‌తో ట్రైలర్‌లో దుమ్మురేపాడు. రెండు నిమిషాల 37 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ అక్షయ్ అభిమానుల్ని ఉపేస్తోంది. పోస్టుచేసిన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్‌ను మిలియన్‌కుపైగా వీక్షించారు. మీరూ ఓ లుక్ వేయండి.