సంజయ్ లీలా భన్సాలీ సినిమాలన్నీ భారీగా ఉంటాయి. స్క్రీన్ నిండుగా సెట్టింగులు ఉంటాయి. పాటల్ని చాలా కలర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తుంటారాయన. అందుకే ఆయన సినిమాల్లో పాటలకు ప్రత్యేక క్రేజ్. తాజాగా భన్సాలీ కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీకి. ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘గంగూభాయ్ కతియావాడి’. ఈ సినిమాలో ఆలియా భట్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం హ్యూమా ఖురేషీ డ్యాన్స్ చేయనున్నారట. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment