మా ఇల్లు ఒక మినీ అసెంబ్లీ! | Our house is a mini-assembly! | Sakshi
Sakshi News home page

మా ఇల్లు ఒక మినీ అసెంబ్లీ!

Jul 7 2014 10:23 PM | Updated on Aug 17 2018 2:24 PM

మా ఇల్లు ఒక మినీ అసెంబ్లీ! - Sakshi

మా ఇల్లు ఒక మినీ అసెంబ్లీ!

‘స్ట్రగుల్ పీరియడ్’ను దాటి వచ్చాను అని చెబుతుంటారు. నిజానికి స్ట్రగుల్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒకటి దాటిన తరువాత ఇంకొకటి సిద్ధంగా ఉంటుంది.

మై ఫిలాసఫీ
 
‘స్ట్రగుల్ పీరియడ్’ను దాటి వచ్చాను అని చెబుతుంటారు. నిజానికి స్ట్రగుల్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒకటి దాటిన తరువాత ఇంకొకటి సిద్ధంగా ఉంటుంది. ఒక సవాలును అధిగమించగానే దాని గురించి మరచిపోయి కొత్త సవాలు గురించి ఆలోచిస్తుంటాను.
     
నా వరకు, ఒక రోజు అంటే... ఒక పాఠం. అలా సంవత్సరం పొడవునా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.
     
చర్చ ఎప్పుడూ మంచిదే. ఒకరి నుంచి ఒకరు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మార్చుకోవల్సిన అభిప్రాయాలు ఉంటే మార్చుకోవచ్చు. సినిమాలకు సంబంధించి మా ఇల్లు మినీ అసెంబ్లీ. ఎన్నో సార్లు ఎన్నో సినిమాల మీద చర్చలు జరిగేవి. అలా చర్చించే క్రమంలో అభిప్రాయ వ్యక్తీకరణ బలపడేది. కొత్త విషయాలు తెలిసేవి.
      
వాస్తవాలతో సంబంధం లేకుండా కొన్ని అభిప్రాయాలు స్థిరపడిపోతాయి. ఉదా: సన్నగా, మెరుపు తీగలా ఉన్న హీరోయిన్‌లే రాణిస్తారు అని. దీన్ని నేను నమ్మను. అందుకే బరువు తగ్గి బాగా సన్నబడాలి అనే ఆలోచన చేయలేదు.
 
లావు, సన్నం అనేవి నటనకు ప్రమాణాలవుతాయని నేను అనుకోను.
     
ఒక సినిమా బాగా ఆడుతుందా లేదా అనేది నటుల చేతిలో లేదు. కానీ, ఒక పాత్రకు న్యాయం చేయడం అనేది పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుంది. ఈ స్పృహతోనే నా పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను.
     
రేపు నాకు అంతా మంచే జరుగుతుంది...అని ఎప్పటికప్పుడు అనుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలూ లేకుండా సుఖంగా ఉండొచ్చు.
 
‘ఏదో ఒక రోజు ఊపిరిసలపనంత బిజీగా ఉంటాను’ అనుకునేదాన్ని. అది ఇవాళ నిజమైంది. మనస్ఫూర్తిగా కోరుకున్నవి ఫలిస్తాయని నా నమ్మకం.
 
- హుమా ఖురేషి, హీరోయిన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement