లాక్‌డౌన్‌ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది | Huma Qureshi Shares Throw Back Video Says Awaits End Of Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది

Published Wed, May 20 2020 4:36 PM | Last Updated on Wed, May 20 2020 9:16 PM

Huma Qureshi Shares Throw Back Video Says Awaits End Of Lockdown - Sakshi

కరోనా కారణంగా దాదాపు ఇళ్లకే పరిమితమైన ప్రజలు బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. వీరిలో ముఖ్యంగా సెలబ్రిటీలు రెండు నెలలుగా ఇంటి నుంచి అడుగు బయట పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే ఏం చేయాలో ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ముగిసిందన్న విషయం తెలిసినప్పుడు తన ఆనందం ఎలా ఉంటుందో చెప్పేందుకు బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. గతంలో డ్యాన్స్‌ చేస్తూ దిగిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.‘ లాక్‌డౌన్‌ ఎత్తివేత’ వార్త విన్నప్పుడు తన ఆనందం ఇలాగే ఉంటుంది. ఇలా డ్యాన్స్‌ చేస్తా. ఆ వార్త ఎప్పుడు వింటానో.’ అంటూ ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. (ఈ రోజే రానా-మిహీక నిశ్చితార్థం)

ఖురేషీ పోస్టుపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. అనేక మంది స్మైలీ ఎమోజీలను జతచేస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమకు చెందిన హ్యుమా స్నేహితులు చాలా మంది ఆమె పోస్టుపై సరాదాగా కామెంట్‌ చేస్తున్నారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ దొరికినప్పుడు ఇలాగే డ్యాన్స్‌ చేయాలని కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్ కామెంట్‌ చేశారు. కాగా ఇంతకముందు పోస్టులో హ్యూమా కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ, తాను ఉదయం నుంచి రాత్రి వరకు పాటించే దినచర్యను షేర్‌ చేశారు. (హ్యాపీ బర్త్‌డే జూ. ఎన్టీఆర్‌: వార్నర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement