
హుమ ఖురేషీకి సూపర్ చాన్స్
నటి హుమ ఖురేషీ సూపర్ చాన్స్ కొట్టేసిందా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఢిల్లీలో పుట్టి పెరిగి చదివిన ఈ అమ్మడు ముంబైలో మోడలింగ్ చేసింది. అలా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దృష్టిలో పడడంతో ఈ బ్యూటీ ఫ్యూచర్ రొట్టే విరిగి నేతిలో పడ్డ చందంగా మారిపోయింది.ఆయన దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రంలో నాయకిగా మారిపోయింది. ఆ తరువాత త్రిష్ణ, బదలాపూర్, జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్రాలతో పాపులర్ నాయకి అయ్యింది. ఆ మధ్య మమ్ముట్టికి జంటగా వైట్ అనే చిత్రం ద్వారా మాలీవుడ్‌కు పరిచయమైన హుమ ఖురేషీ అదృష్టం తేనెతుట్టెలా పట్టిందని చెప్పవచ్చు.కారణం త్వరలో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది.అదీ అలాంటి ఇలాంటి హీరోతో కాదు.స్టార్‌స్టార్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేసే లక్కీచాన్స్‌ను దక్కించుకున్నట్లు తాజా సమాచారం.
2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ తాజాగా కబాలి 2కు రెడీ అవుతున్నారన్న విషయం తెలిసిందే. కబాలి చిత్రం ఫేమ్ రంజిత్‌నే ఈ చిత్రానికి దర్శకుడు.కాగా రజనీకాంత్ అల్లుడు, స్టార్ నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణన్ ఇప్పటికే సంగీత బాణీలు కడుతున్నారు. చిత్రం ఈ నెల 28న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో రజనీకాంత్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటికే నయనతార, దీపికాపదుకోనే, విద్యాబాలన్ వంటి టాప్ నటీమణుల పేర్లు ప్రచారంలో హల్‌చల్ చేశాయి.
చివరికి ఆ అదృష్టం నటి హుమ ఖురేషీకి దక్కినట్లు తాజా సమాచారం. ఇందులో బాహుబలి 2 చిత్రానికి పని చేసిన హాలీవుడ్ సాంకేతిక వర్గంలో పీటర్ డ్రపర్ బృందం వీఎఫ్‌ఎక్స్‌ను అందించనున్నట్ల తెలిసింది.ఇప్పటికే హాజీ మస్తాన్ ఇతివృత్తంతో తెరకెక్కనున్న చిత్రంగా కలకలం పుట్టిస్తున్న ఈ చిత్రం కోసం ముంబైలోని ధారవి ప్రాంతం సెట్‌ను చెన్నైలో రూపొందించారు. అందులో చిత్ర ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించడానికి కబాలి 2 చిత్ర యూనిట్ సిద్ధం అవుతునట్లు తాజా సమాచారం.