Kalaavathi Making Video: Sarkaru Vaari Paata Movie Kalaavathi Song Making Video Out Now - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: కళావతి మేకింగ్‌ వీడియో, ఈ పాట కోసం ఎంత ఖర్చయిందంటే?

Published Fri, Feb 18 2022 2:59 PM | Last Updated on Fri, Feb 18 2022 3:17 PM

Sarkaru Vaari Paata: Kalaavathi Song Making Video Out Now - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, మహానటి కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం సర్కారువారి పాట. వాలంటైన్స్‌ డేకు ఒకరోజు ముందే అంటే ఫిబ్రవరి 13న ఈ సినిమా నుంచి కళావతి సాంగ్‌ రిలీజైంది. వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు దూకినాయా.. ఏందే నీ మాయ.. అంటూ సాగే లిరిక్స్‌ సంగీతప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పటివరు ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో 29 మిలియన్ల వ్యూస్‌ రాగా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. సెన్సేషనల్‌గా మారిన ఈ హిట్‌ పాటకు తమన్‌ సంగీతం అందించగా సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు.

తాజాగా ఈ సాంగ్‌ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇందులో చిత్రయూనిట్‌ మహేశ్‌, కీర్తి సురేశ్‌ ఫన్నీ మూమెంట్స్‌ను చూపించారు. ఇక ఈ లిరికల్‌ సాంగ్‌ కోసం నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా రూ.40- రూ.60 లక్షల మేర ఖర్చు చేసినట్లు ఫిల్మీదునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మే 12న విడుదలవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement