
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా’ మూవీ కోసం గతేడాదిగా మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. చిరు గత పుట్టిన రోజున విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమాతో మళ్లీ రికార్డులు బ్రేక్ చేస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ ‘సైరా’పై అంచనాలు రెట్టింపు చేస్తున్నారు.
తాజాగా మెగా అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ కానుకగా సర్ ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. ఈ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారు. బుధవారం(ఆగస్టు 14) సాయంత్రం 3:45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పోస్టర్‌లో చిరు లుక్ కూడా అదిరిపోయింది. దీంతో మెగా అభిమానులు సైరా మేకింగ్ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఓ వైపు షూటింగ్ జరుగుతూ ఉండగానే డబ్బింగ్ పనులు మొదలుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు చిరు రికార్డు టైమ్‌లో తన డబ్బింగ్‌ను పూర్తి చేశారని టాక్. అసలే చారిత్రాత్మక చిత్రం కావడంతో.. భారీ డైలాగ్‌లు కూడా ఉంటాయని తెలిసిందే. అయినా చిరు తన డబ్బింగ్‌ను ఫుల్ స్పీడ్‌గా కంప్లీట్ చేశారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్‌చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment