Video leaked From Prabhas Salaar movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు దగ్గరకు వస్తోంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ బర్త్‌డే హంగామా మొదలైంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. దీంతో రెండు వారాల ముందునుంచే ప్రభాస్ బర్త్‌డే పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేగాక ఆయన నటిస్తున్న పాన్ చిత్రాలకు సంబంధించిన మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అందించే వీడియో ఒకటి బయటకు వచ్చింది.
చదవండి: లైవ్‌చాట్‌లో పూజ హెగ్డే కు షాకింగ్ ప్రశ్న, నెటిజన్‌కు హీరోయిన్ చురక
కాగా ప్రభాస్ ప్రుస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే మొదటి నుంచి ‘సలార్’ మూవీకి లీక్‌ల బెడద తప్పడం లేదు. ఈ మూవీ సెట్స్‌లోని ప్రభాస్ ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో సలార్ మూవీ సెట్ ప్రభాస్‌పై చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్ మేకింగ్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఈ వీడియోలో ప్రభాస్‌తో చేతిలో గన్, చూట్టు సంచలను చూస్తుంటే ఇది హోరాహోరిగా సాగే ఫైట్ సీన్ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
చదవండి: ఆ పాన్ ఇండియా చిత్రంలో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా ప్రభాస్
ప్రభాస్ బర్త్‌డే నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడంతో ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు. కాగా సలార్‌తో పాటు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. అంతేగాక రాధ కృష్ణ తెరకెక్కించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత నాగ్ అశ్విన్‌తో మూవీ నెక్ట్ ఈయర్ సెట్స్‌పై రానుంది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Here is the leaked bit for out fans 💥#PrabhasBirthdayCDP #Prabhas #Salaar
— PRABHAS UPDATES OFFICIAL (@PRABHASUPDATESS) October 19, 2021
Kutha ramp antey edhey nemo 💥💥 pic.twitter.com/AIJ0YzD0o5
Comments
Please login to add a commentAdd a comment