Samantha Yashoda Movie First Glimpse Released - Sakshi
Sakshi News home page

Samantha: సమంత ‘యశోద’ మూవీ నుంచి ఫస్ట్‌గ్లిం‍ప్స్‌ విడుదల

Published Thu, May 5 2022 12:16 PM | Last Updated on Thu, May 5 2022 1:08 PM

Samantha Yashoda movie First Glimpse Release - Sakshi

Samantha Yashoda movie First Glimpse Out: స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద.  హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌ నిర్మించింది. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ  సినిమా నుంచి తాజాగా మేకర్స్‌ అప్‌డేట్‌ను షేర్‌ చేశారు. ‘య‌శోద’ చిత్రానికి సంబంధించిన స్పెషల్‌ వీడియోను ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరుతో ఈ రోజు(మే 5న) విడుదల చేశారు మేకర్స్‌. ఈ వీడియోలో సామ్‌.. ఓ హ‌స్పిట‌ల్ బెడ్‌పై నుంచి స‌డ్డెన్‌గా లేచి చేతికి ఉన్న బాండ్‌ను ఆశ్చ‌ర్యంగా చూసుకుంటుంది.

ఆ త‌రువాత మెల్లిగా నడుచుకుంటూ కిటీకి వైపు వెళుతుంది. బ‌య‌ట ఉన్న పావురాన్ని తాక‌బోతుండగా వెంటనే య‌శోదా టైటిల్ వ‌స్తుంది. ఇక ఎలాంటి డైలాగ్స్ లేకుండా విడుదల చేసిన ఈ వీడియో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ గ్లిం‍ప్స్‌లో చూస్తుంటే స‌మంత ఇమాజిన‌రి ప్ర‌పంచంలో ఉన్న‌ట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలోవ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి ఆగస్టు12న ఈ సినిమా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement