Samantha Yashoda Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha Yashoda Movie: సమంత 'యశోద' రిలీజ్ డేట్‌ ఫిక్స్‌.. చైతూ, అఖిల్‌తో ఢీ !

Published Tue, Apr 5 2022 8:27 PM | Last Updated on Tue, Apr 5 2022 9:01 PM

Samantha Yashoda Movie Release Date Announced - Sakshi

Samantha Yashoda Movie Release Date Announced: టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు విడాకుల తర్వాత మరింత క్రేజ్‌ పెరిగిందనండంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా పెళ్లి, విడాకుల వంటి సంఘటనల తర్వాత హీరోయిన్లకు అంతగా ఆఫర్స్‌ రావు. కానీ సమంత విషయంలో అది తప్పని రుజువైంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా అదే క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది సామ్‌. వరుస సినిమా అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఓ ఇంటర్నేషనల్‌ మూవీ కూడా ఉండటం విశేషం. ఇటీవల తన చిత్రాల్లో ఒకటైన 'కాతువాకుల రెండు కాదల్‌' మూవీ విడుదల తేదిని ప్రకిటంచింది సామ్. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. 

చదవండి: ఆ హీరోను నామినేట్‌ చేసిన సమంత.. ఎందుకో తెలుసా ?

తాజాగా తన పాన్‌ ఇండియా మూవీ యశోద సినిమా రిలీజ్‌ డేట్‌ను మంగళవారం (ఏప్రిల్‌ 5) ప్రకటించింది సమంత. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్‌ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని హరి-హరీశ్‌ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఒక రోజు ముందు అమీర్ ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చద్దా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతోనే అక్కినేని నాగచైతన్య బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ డబ్ చేయనున్నారట. అంటే నాగచైతన్య 'లాల్ సింగ్‌ చద్దా'తో ఆగస్టు 11న సమంత 'యశోద'తో ఆగస్టు 12న బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. 



అలాగే అక్కినేని అఖిల్‌ 'ఏజెంట్' చిత్రం కూడా ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. సురేందర్‌ రెడ్డి డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్‌ చిత్రాలతో సమంత మూవీ పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. 



చదవండి: ఆ స్టార్‌ డైరెక్టర్‌తో నాగ చైతన్య మూవీ !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement