
ది ఫ్యామిలీ మ్యాన్–2 వెబ్‌సిరీస్, కాత్తు వాక్కుల రెండు కాదల్ తర్వాత సమంతా తమిళ ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం యశోద, నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థ తెలుగు, తమిళం భాషల్లో నిర్మిస్తున్నారు. కన్నడం, మలయాళం భాషల్లోనూ అనువదించి విడుదల చేయనున్నారు.
యదార్థ సంఘటన ఆధారంగా క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్ర యూనిట్ వెల్లడించారు. అయితే ఇప్పుడు చిత్రం విడుదల వాయిదా పడింది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడమే చిత్ర విడుదలకు కారణమని సమాధానం. యశోద చిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలున్నాయి.