Samantha Worrying About Yashoda Movie Collections, Deets Inside - Sakshi
Sakshi News home page

Yashoda: సమంతకు మరో టెన్షన్‌.. ఇదే సరైన సమయం!

Published Wed, Nov 9 2022 2:23 PM | Last Updated on Wed, Nov 9 2022 4:18 PM

Samantha Feel Tension For Yashoda Movie - Sakshi

సమంత ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ‘యశోద’.నవంబర్‌ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో సమంత డూప్‌ లేకుండా  యాక్షన్‌ సీన్స్‌ చేసింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పింది. ఓ పక్క తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నా  రిస్క్‌ తీసుకొని మరీ ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ చేసింది. ఇదంతా ఎందుకు అని సమంతని అడిగితే..  ‘నన్ను నమ్మి సినిమా చేశారు కదా.. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా’అంటూ సింపుల్‌గాచెబుతోంది.

(చదవండి: అడుగు కూడా ముందుకు వేయలేనోమో అనిపిస్తోంది.. సమంత కన్నీళ్లు)

అది నిజమే మరి. సమంతని నమ్ముకొనే  సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అనుకున్న దానికంటే ఎక్కువే బడ్జెట్‌ పెట్టాడట. ఆమెకు ఉన్న ఇమేజ్‌ దృష్టా ఓవరాల్‌గా ఈ చిత్రానికి దాదాపు రూ. 24 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగిందట. ఓ ఫీమేల్‌ సెంట్రిక్‌ సినిమాకు ఇది పెద్ద టార్గెట్‌ అనే చెప్పొచ్చు.  ఆ టార్గెట్‌ని సామ్‌ రీచ్‌ అవ్వాలంటే.. పాతిక కోట్ల షేర్‌ని రాబట్టాలి. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ లభిస్తే ఆ టార్గెట్‌ ఈజీగా పూర్తవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే సమంత మాత్రం కాస్త టెన్షన్‌ పడుతుందట. తన సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉన్నప్పటికీ.. భారీ స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతుందో లేదో అని ఎక్కడో చిన్న భయం ఆమెను వెంటాడుతుందట. 

‘కథ విన్నప్పుడు నాకు  గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు’అని సామ్‌ గట్టి నమ్మకంతో చెబుతోంది. అయితే ఎవరు ఏం చెప్పినా.. అల్టిమేట్‌గా ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది. మరి సామ్‌ చెప్పినట్లుగా ఈ సినిమా ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఒకవేళ సినిమా హిట్‌ అయితే మాత్రం సమంత పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణించడమే కాకుండా.. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయడానికి ఆస్కారం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement