Samantha Yashoda Trailer Will Be Out On 27th Oct - Sakshi
Sakshi News home page

Samantha : సమంత యశోద మూవీ నుంచి కీలక అప్‌డేట్‌

Published Mon, Oct 24 2022 1:47 PM | Last Updated on Mon, Oct 24 2022 2:11 PM

Samantha Yashoda Trailer Will Be Out On 27th Oct - Sakshi

సమంత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం 'యశోద'. హరి, హరీష్‌ ద్వయం దర్శకత్వం వహించగా.. శ్రీదేవి మూవీస్‌ సంస్థ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు.యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలు పోషించారు.  

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ నవంబర్‌ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. ట్రైలర్‌ను ఈనెల 27న రిలీజ్‌ చేస్తున్నట్లు మరో పోస్టర్‌లో వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement