Samantha vs Naga Chaitanya: Samantha Yashoda Movie Box Office Clashes With Naga Chaitanya Lal Singh Chaddha Movie - Sakshi
Sakshi News home page

Samantha Vs Naga Chaitanya: బాక్సాఫీసు వద్ద తలపడబోతున్న సమంత, నాగచైతన్య

Published Fri, May 6 2022 7:50 PM | Last Updated on Fri, May 6 2022 8:52 PM

Samantha Vs Naga Chaitanya: Yashoda On 12th August, Laal Singh Chaddha On 13th - Sakshi

Samantha Vs Naga Chaitanya: బాక్సాఫీసు వద్ద టాలీవుడ్‌ మాజీ కపుల్స్‌ పోటీ పడబోతున్నారు. హీరో నాగచైతన్య తొలిసారి హిందీలో నటించిన ఈ చిత్రం లాల్‌ సింగ్‌ చద్దా, సమంత తాజా చిత్రం యశోదలు ఒక్కరోజు తేడాతో బిగ్‌స్క్రీన్‌ వద్ద పోటీపడనున్నాయి. దీంతో వీరి ఫాలోవర్సతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఒక్క​సారే రిలీజ్‌ కాబోతున్న వీరి సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనంటూ నెటిజన్లు చర్చికుంటున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది.

చదవండి: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి కేజీయఫ్‌ 2, హిందీలో ఈ 2 దక్షిణాది సినిమాలే టాప్‌

దర్శక ద్వయం హరి-హరీశ్‌లు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. నాగచైతన్య హిందీ డెబ్యూ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలను పోషించగా... నాగచైతన్య కీ రోల్‌ పోషించాడు. మరి ఈ సినిమాల అదే డేట్‌కు వస్తాయా? లేక విడుదల తేదీలో మార్పులు చేసుకుంటాయా? చూడాలి. మరోవైపు చై సోదరుడు అఖిల్‌ నటించిన ఏజెంట్‌ చిత్రం యశోద మూవీ రోజునే విడుదల కాదనుంది. యశోద, ఏజెంట్‌లు రెండు అగష్టు 12న థియేటర్లో విడుదల కానున్నాయి.

చదవండి: ఉపాసన.. నా మైండ్‌లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement