Samantha to Play Pregnant Women Role in Yashoda Movie? - Sakshi

Samantha : సామ్‌ మరో డేరింగ్‌ స్టెప్‌.. ప్రెగ్నెంట్‌ రోల్‌కి సై!

Jan 18 2022 3:05 PM | Updated on Jan 18 2022 4:04 PM

Samantha To Play Pregnant Role In Yashoda Movie - Sakshi

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్‌ పరంగా దూసుకెళ్తోంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌,హాలీవుడ్‌ అనే తేడా లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల ఈ బ్యూటీ  అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’ లో స్పెషల్‌ సాంగ్‌ చేసి ఔరా అనిపించింది. స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి తొలుత సంకోచించినప్పటికీ.. దర్శకుడు సుకుమార్‌ బలవంతంగా ఒప్పించి, నటింపంచేశారు. ఇప్పుడు ఆ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. అంతేకాదు సమంతకు బోలెడంత డబ్బుతో పాటు.. ఫేమ్‌ని కూడా తీసుకొచ్చిపెట్టింది. అదే ఉత్సాహంతో సమయంలో మరో డేరింగ్ స్టెప్‌ వేయబోతుంది. తొలిసారి గర్భవతి పాత్రలో నటించబోతుదంట సామ్‌.

వివరాల్లోకి వెళితే.. సమంత ప్రస్తుతం పాన్‌ ఇండియా మూవీ ‘యశోద’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరి మరియు హరీశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత ప్రెగ్నెంట్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నర్సు అయిన ఓ ప్రెగ్నెంట్‌ మహిళలకు అనుకోని సమస్యలు ఎదురైనే.. ఆమె ఒక్కతే వాటిని ఎలా అధిగమించింది అనే నేపథ్యంలో ‘యశోద’చిత్రం తెరకెక్కుతుదంట. విడాకుల తర్వాత ఇలా డిఫరెంట్‌ పాత్రల్లో నటించడంతో సామ్‌ పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement