
సమంత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం 'యశోద'. నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి మూవీస్ సంస్థ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించారు మేకర్స్. నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను అలరించనున్నట్లు ప్రకటించారు. చిత్రబృందం కొత్తగా రిలీజ్ సమంత పోస్టర్ మరింత ఆసక్తి పెంచుతోంది. కొత్త పోస్టర్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, సమంత ముఖంపై గాయాలతో చూపించారు. ఈ సినిమాలో సమంత గర్భిణీ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
( చదవండి: సమంత యశోద మూవీ మరింత ఆలస్యం)
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. 'యశోద కొత్త కాలం నాటి యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా మిస్టరీ, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో ఉంటుంది. టైటిల్ రోల్ ప్లే చేస్తూ సమంత యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. కొత్త తరం సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా ఉంటారు.' అని అన్నారు. సమంత తదుపరి ప్రాజెక్ట్ పౌరాణిక చిత్రం శాకుంతలం. ఇందులో ఆమె యువరాణి పాత్రలో కనిపించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు.
Make way for #Yashoda in theatres on Nov 11th 2022🔥
— Sridevi Movies (@SrideviMovieOff) October 17, 2022
Releasing Worldwide in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi#YashodaTheMovie @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/YgXeFh9i6i
Comments
Please login to add a commentAdd a comment