Yashoda Movie Trailer Out - Sakshi
Sakshi News home page

Yashoda Trailer: ఆసక్తి రేపుతున్న ‘యశోద’ ట్రైలర్‌.. యాక్షన్‌ సీన్‌లో అదరగొట్టిన సమంత

Published Thu, Oct 27 2022 6:35 PM | Last Updated on Thu, Oct 27 2022 7:12 PM

Yashoda Movie Trailer Out - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'యశోద'. ఇటీవల విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ‘నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా’ అని సమంత చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. 

టీజర్‌లో సమంత గర్భవతి అని చూపించారు. ట్రైలర్‌లో డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళ అని స్పష్టం చేశారు. అంటే 'యశోద'ది సరోగసీ ప్రెగ్నెన్సీ అన్నమాట! అక్కడితో కథ అయిపోలేదు. సరోగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం... ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించారు. సరోగసీ కోసం తీసుకొచ్చిన మహిళలకు ఏం జరుగుతోంది? ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న 122 మంది సంపన్న మహిళలు పేర్లు బయటకు రావడానికి, సరోగసీ ప్రెగ్నెన్సీ ధరించిన మహిళలకు సంబంధం ఏమిటి? ప్లాన్ ప్రకారం ఎవరి హత్య జరిగింది? అని ప్రేక్షకులు ఆలోచించేలా ట్రైలర్ కట్ చేశారు.  

ఈ ట్రైలర్‌ని ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. హరి- హరీశ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 11న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement