![Samantha Demands Huge Remuneration for Yashoda Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/5/Samantha.jpg.webp?itok=rMVV4Atf)
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సమంత. ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌లో రాజీగా అదరగొట్టినా, పుష్పలో ఊ అంటావా మావా అంటూ ఐటం సాంగ్‌తో కవ్వించినా అది ఒక్క సామ్‌కే చెల్లుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్ మీద మరింత ఫోకస్ పెట్టిన ఈ హీరోయిన్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె పాన్ ఇండియా చిత్రం యశోదలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి సామ్ ఫస్ట్ లుక్ రిలీజవగా అది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సామ్ యశోదకుగానూ ఎంత పారితోషికం తీసుకుంటుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.
ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సామ్ యశోద సినిమాకు రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటుందట! సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరీశ్ శంకర్, హరీశ్ నారాయన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవీ మూవీ బ్యానర్‌పై శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment