Actress Samantha Shocking Remuneration For Upcoming Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha: రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన సమంత.. ఎంతో తెలుసా?

Published Tue, Oct 25 2022 10:45 AM | Last Updated on Tue, Oct 25 2022 11:44 AM

Samantha Charges Whopping Remuneration For Upcoming Movies - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత తెలుగుతో పాటు హిందీలో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా మారిపోయింది. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ దక్కించుకున్న సమంత అదే స్థాయిలో రెమ్యునరేషన్‌ కూడా పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం సామ్‌ సైన్‌ చేయబోయే సినిమాలకు దాదాపు రూ. 3-8కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం.

అంతేకాకుండా త్వరలోనే ముంబైలో రూ. 30కోట్లతో ఓ విలాసవంతమైన ఇంటిని కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా సమంత నటించిన యశోద సినిమా నవంబర్‌11న విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు ఇప్పటికే శాకుంతలం షూటంగ్‌ కంప్లీట్‌ చేసిన సామ్‌ విజయ్‌ దేవరకొ​ండతో​ ఖుషీ చిత్రంలో నటిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement