
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'యశోద' సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈనెల 12వరకు ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ మొదలు పెడతామని, మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు.
హరి - హరీశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ సైతం కీలక పాత్రలో కనిపంచనున్నారు. మణివర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment