బాహుబలి-2 కోసం హాలీవుడ్ మొత్తం దిగింది! | 'Baahubali 2' team begins filming climax portion | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 కోసం హాలీవుడ్ మొత్తం దిగింది!

Published Mon, Jun 13 2016 4:13 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

బాహుబలి-2 కోసం హాలీవుడ్ మొత్తం దిగింది!

బాహుబలి-2 కోసం హాలీవుడ్ మొత్తం దిగింది!

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి-2 కోసం హాలీవుడ్ నుంచి పలువురు నిపుణులు దిగిపోయారు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇది పది వారాల పాటు కొనసాగనుంది. కొన్ని నెలల పాటు ముందుగా ప్లాన్ చేసి, రిహార్సల్స్ వేసుకున్న తర్వాత క్లైమాక్స్ షూటింగ్ మొదలుపెట్టామని, ఇప్పటినుంచి ఆగస్టు వరకు తుది షెడ్యూలులో భారీ యుద్ధ సన్నివేశం షూట్ చేస్తామని సినిమా వర్గాలు వెల్లడించాయి. గత రెండు నెలలుగా ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇక ఈ యుద్ధ సన్నివేశం షూటింగ్ కోసం హాలీవుడ్ నుంచి నిపుణుల బృందం పెద్ద ఎత్తున దిగింది. గతంలో లింగా, బాహుబలి సినిమాలకు యాక్షన్ డైరెక్షన్ చేసిన లీ వీట్టేకర్ ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చాడు. అతడితో పాటు బ్రాడ్ అలన్, అతడి బృందం మొత్తం దిగింది. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాతో పాటు 'ద హంగర్ గేమ్స్' సిరీస్‌కు పనిచేసిన లార్నెల్ స్టోవాల్, 'ద హాబిట్' సినిమాకు పనిచేసిన మోర్న్ వాన్ టాండర్ లాంటివాళ్లు ఈ క్లైమాక్స్ సన్నివేశాలకు కీలకంగా మారనున్నారు. వీళ్లందరినీ సమన్వయం చేసుకుంటూ రాజమౌళి క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే ఈ సినిమా 2017 ఏప్రిల్ 18న విడుదల కావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement