క్లైమాక్స్ గురించి సల్మాన్ భయపడ్డాడు
తమిళ్ సేతు చిత్రం, తెలుగులో శేషుగా, బాలీవుడ్లో తేరే నామ్‌గా రీమేక్ చేశారు. సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్‌ఖాన్ హీరోగా నటించాడు. 2003లో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, రాధే పాత్రలో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్ ఖాన్ విశేషంగా ఆకట్టుకున్నాడు. అయితే సల్లూభాయ్‌కు ఎంతో పేరు తెచ్చిన ఈ సినిమా ముగింపు మాత్రం అతనికి అస్సలు నచ్చలేదట. ఈ విషయాన్ని దర్శకుడు సతీష్ కౌశిక్ స్వయంగా వెల్లడించాడు. ఈ చిత్ర క్లైమాక్స్ ద్వారా మనం యువతకు తప్పుడు సందేశం ఇస్తున్నామని ఆయన విచారం వ్యక్తం చేశాడని తెలిపాడు. (అది తెలిసి షాకయ్యాను: మాధురీ దీక్షిత్)
తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆనాటి విషయాలను పంచుకున్నాడు. "మీరు నమ్మరు గానీ, తేరే నామ్ షూటింగ్ సమయంలో సల్మాన్ ఓ మాట అన్నాడు. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు, ఆ విషయం పక్కన పెడితే క్లైమాక్స్ సన్నివేశంలో యువతకు చెడు సందేశం ఇస్తున్నామని, దీని ద్వారా యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందాడు. ఒక ప్రేక్షకుడిగా, దర్శకుడిగా చెప్పాలంటే... నెగెటివ్, పాజిటివ్ అన్ని రకాల పాత్రలు సినిమాలో ఉండాల్సిందే. కానీ క్లైమాక్స్‌లో మాత్రం తేరే నామ్ సినిమాలో లాగా చెడుదే విజయంగా చూపించకూడదు" అని సతీష్ పేర్కొన్నాడు. (25వేల మందికి సల్మాన్ సాయం)