హాలీవుడ్ తెరపై రెండో ప్రపంచ యుద్ధం
ది డార్క్ నైట్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్ లాంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నోలన్, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పీరియాడిక్ సినిమాల హవా నడుస్తోంది. అదే బాటలో రెండు ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు క్రిస్టోఫర్. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ డైనమో కథను ఈ సినిమాలో చూపించనున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ వార్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ వార్ డ్రామా, 2017 జూలైలోరిలీజ్ కానుంది. క్రిస్టోఫర్ నోలన్ గత చిత్రాల తరహాలోనే భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తన ప్రతీ సినిమాతో అంతర్జాతీయ సినీ వేదికల మీద సత్తా చాటే ఈ స్టార్ డైరెక్టర్ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.