Inception
-
నేడు ఐఐఎం విశాఖ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/రేణిగుంట (తిరుపతి జిల్లా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఒకటి అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)– విశాఖపట్నం శాశ్వత క్యాంపస్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం–విశాఖ కార్యకలాపాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాల్ని ఉచితంగా కేటాయించింది. ఇందులో శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసే పనుల్ని రెండు దశల్లో చేపట్టారు. మొదటి దశలో రూ.472.61 కోట్లతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియాని అభివృద్ధి చేశారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. అడుగడుగునా అద్భుతమనేలా హరిత భవనం (గ్రీన్ బిల్డింగ్), స్మార్ట్ భవనంగా దీన్ని తీర్చిదిద్దారు. 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంటును నిరి్మంచారు. దీని ద్వారా సంవత్సరానికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్ధులు ‘యు’ ఆకారంలో కూర్చొనేలా తరగతి గదులు నిర్మించారు. తిరుపతి ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ శాశ్వత క్యాంపస్‌లు కూడా.. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) శాశ్వత క్యాంపస్‌లను కూడా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పేడు సమీపంలోని రెండు క్యాంపస్‌లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పేడు సమీపంలో రెండు విద్యా సంస్థలకు 895 ఎకరాలను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జాతికి అంకితం చేసే కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ, ఐఐఎస్ఈఆర్ డైరెక్టర్ శంతాను భట్టాచార్య పాల్గొంటారు. -
కార్పొరేట్‌ను తలదన్నేలా...
ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్‌ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్‌ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్‌కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్‌కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రులు ఇలా... ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్ని వసతులతో... వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. – డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) -
ఆ సినిమా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు: మాధవన్
Madhavan Rocketry The Nambi Effect Showing In Cannes Festival 2022: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో మంచి గుర్తింపు ఉన్న నటుడు మాధవన్. ఇప్పటి వరకు హీరోగా, నటుడిగా అలరించిన మాధవన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మాధవన్ మొదటిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మాధవన్ చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'ను ప్రదర్శించారు. అనంతరం ఈ కార్యక్రమంలో నిర్వహించిన చర్చలో భాగంగా మాధవన్‌తోపాటు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, నంబి నారాయణ్ చిత్ర నిర్మాత శేఖర్ కపూర్, గీత రచయిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాధవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'ఆర్యభట్ట నుంచి సుందర్ పిచాయ్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాకి చెందిన అనేక వ్యక్తులకు ఎన్నో అసాధరణమైన చరిత్ర ఉంది. వీరికి సినీతారలు, నటీనటుల కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. యువతకు వారెంతో స్ఫూర్తి. కానీ ఇలాంటి వారిపై మేము సినిమాలు తీయడం లేదు.సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించి వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు పొందిన వ్యక్తులను సినీ ప్రొడ్యూసర్స్ గుర్తించడం లేదు. క్రిస్టోఫర్ నోలాన్ సినిమాకు రివ్యూ ఇవ్వడానికి సమీక్షకులు భయపడతారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అర్థంకాకో, ఏదో ఒకటి రాసి ఫూల్ అవ్వడానికి ఇష్టపడరు. నిజం చెప్పాలంటే ఆయన తెరకెక్కించిన 'ఇన్సెప్షన్' నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ ఆయనకు సైన్స్‌పై ఉన్న పరిజ్ఞానం వల్ల ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది.' అని మాధవన్ తెలిపాడు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
నెల్లూరులో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు
-
హాలీవుడ్ తెరపై రెండో ప్రపంచ యుద్ధం
ది డార్క్ నైట్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్ లాంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నోలన్, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పీరియాడిక్ సినిమాల హవా నడుస్తోంది. అదే బాటలో రెండు ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు క్రిస్టోఫర్. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ డైనమో కథను ఈ సినిమాలో చూపించనున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ వార్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ వార్ డ్రామా, 2017 జూలైలోరిలీజ్ కానుంది. క్రిస్టోఫర్ నోలన్ గత చిత్రాల తరహాలోనే భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తన ప్రతీ సినిమాతో అంతర్జాతీయ సినీ వేదికల మీద సత్తా చాటే ఈ స్టార్ డైరెక్టర్ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.