
హాలీవుడ్ సూపర్‌స్టార్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ ఫ్యాన్స్‌కు ఒక శుభవార్త! ఆయన మార్చి నెలలో ఇండియా వస్తున్నారట!! హాలీవుడ్ సినిమా పరిచయమున్న ఈ తరం ఇండియన్ సినీ అభిమానికి నోలన్ పేరు ఎక్కడో ఓ దగ్గర వినిపించే ఉంటుంది. అలాంటి సినిమాలు తీశారాయన. ఈ డిజిటల్ యుగంలోనూ ఫిల్మ్‌పైనే సినిమా తీస్తానని పట్టుబట్టి, ఆ రకంగానూ పాత ట్రెండ్‌నే కొత్తగా పరిచయం చేసిన నోలన్ ఇండియా వస్తున్నారన్న విషయాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్వయంగా తెలియజేశారు.
నోలన్ ఇండియా రావడానికి, బిగ్ బీ అది అనౌన్స్ చేయడానికి సంబంధం ఏంటనేగా? వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా వస్తుందా అని కూడా అనేసుకుంటున్నారా? ప్రస్తుతానికి అదైతే కాదు కానీ, కొడాక్ కంపెనీ ఇండియాలో ఫెసిలిటీ లాంచ్ చేస్తోంది. ఇప్పుడు మరుగున పడిన ఫిల్మ్‌కు మళ్లీ క్రేజ్ తెచ్చే దిశగా, ఫిల్మ్‌లో కింగ్ అనిపించుకున్న కొడాక్ కంపెనీ ప్రయత్నిస్తోందట. అందుకే డిజిటల్ నుంచి సినిమాను ఫిల్మ్ వైపుకు మళ్లిస్తోన్న నోలన్ చేతుల మీదుగా లాంచ్ చేస్తే బాగుంటుందని ఆయనను ఇన్వైట్ చేసిందట. అంటే త్వరలోనే ఈ సూపర్‌స్టార్స్‌ను ఒక దగ్గర చూడొచ్చు! 2012 తర్వాత నోలన్ మళ్లీ ఇండియా రాలేదు. దీంతో ఇది ఆయన అభిమానులకు స్పెషల్ అకేషనే!!
Comments
Please login to add a commentAdd a comment