
కమల్‌హాసన్, క్రిస్టోఫర్ నోలన్
కమల్‌హాసన్.. దేశం గర్వించదగ్గ నటుడు. క్రిస్టోఫర్ నోలన్... ప్రపంచమంతా అభిమానులు సంపాదించుకున్న దర్శకుడు. ఈ ఇద్దరూ ఒకే వేదిక పై కలిస్తే ఎలా ఉంటుంది? సినీ ప్రియులకు కనువిందుగా ఉంటుంది. ఈ వేడుకలో నోలన్‌ను క్షమాపణలు కోరారు కమల్ హాసన్. క్షమాపణలు ఎందుకు కోరారు? కమల్ ఏం పొరపాటు చేశారు అనుకుంటున్నారా? మేటర్ ఏంటంటే డిజిటల్ ఏజ్‌లో కూడా నోలన్ ఫిల్మ్ మేకింగ్‌కు ఇంకా (సెల్యులాయిడ్) రీల్ పద్ధతులనే పాటిస్తారు.
డిజిటల్ యుగంలో సెల్యులాయిడ్ సినిమా ఆవశ్యకతను, ఫిల్మ్ ప్రిజర్వేషన్ ఇంపార్టెన్స్‌ను డిస్కస్ చేయటం కోసమే నోలన్ ఇండియా వచ్చారు. నోలన్ ఇండియాకు రావడం ఇది ఫస్ట్‌టైమ్. ‘‘నోలన్‌ను కలిశాను. తన లేటెస్ట్ సినిమా ‘డంకర్క్’ను డిజిటల్ ఫార్మాట్‌లో వీక్షించినందుకు క్షమాపణలు కోరాను. బదులుగా నా ‘హే రామ్’ సినిమా వీక్షించమని డిజిటల్ ఫార్మాట్ ప్రింట్ అయనకు అందించాను. నోలన్ నా ‘పాపనాశనం’ సినిమా చూశారని తెలిసి ఆశ్చర్యపోయాను’’ అని పేర్కొన్నారు కమల్. వీళ్లిద్దరూ కలిసి ముచ్చటిస్తున్న ఫొటోను ట్వీటర్‌లో షేర్ చేశారు కమల్.