
కరోనావైరస్ కారణంగా టాలీవుడ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పట్లో సినిమాలు లేవనుకున్న సమయంలో అందరిని ఆశ్చర్యపరుస్తూ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన టెనెట్ సినిమాలను విడుదల చేశారు. జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికీ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 26 ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. 225 మిలియన్ డాలర్లతో వార్నర్ బ్రదర్స్ ఈ సినిమాను నిర్మించారు. సైన్స్‌ఫిక్షన్ స్పై డ్రామా ఇది. ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధంలో పొంచివున్న అణుధార్మిక ప్రమాదం గురించి ఈ సినిమాలో చూపించారు.
అయితే సినిమా తీయడమే ఓ సాహసం అయితే.. కరోనా సమయంలో విడుదల చేయడం మరో సాహసం అని చెప్పొచ్చు. కోవిడ్ సమయంలోనూ టెనెట్ 53 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే మన భారత కరెన్సీలో 387 కోట్లు. ఇంకా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 180 మిలియన్ డాలర్లు రాబాట్టాలి. అయితే కరోనా కష్టకాలంలోనూ ఆ మాత్రం వసూలు రాబట్టిందంటే గొప్పవిషయమనే చెప్పాలి. అసలు ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ పై మొదటి నుంచి కూడా చాలా అనుమానాలు వచ్చాయి. ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని ఎవరు అనుకోలేదు. త్వరలోనే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇండియాలో ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment