ఓటీటీకి వచ్చేస్తోన్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Christopher Nolan's Oppenheimer Movie OTT Release Date Confirmed | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల తర్వాత ఓటీటీకి ఓపెన్ హైమర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Published Thu, Nov 9 2023 2:57 PM | Last Updated on Thu, Nov 9 2023 3:38 PM

Christopher Nolan Oppenheimer Movie OTT Release Streaming From 21st - Sakshi

క్రిస్టోఫ‌ర్ నోల‌న్ దర్శకత్వంలో తెరకెక్కించిన హాలీవుడ్‌ చిత్రం  ఓపెన్ హైమ‌ర్.  ఈ ఏడాది జూలైలో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  ఈ హాలీవుడ్ మూవీ తాజాగా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. న‌వంబ‌ర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఓటీటీ రిలీజ్‌కు మ‌రో ప‌ది రోజులు ఉండ‌గానే ఈ మూవీ ఆన్‌లైన్‌లో లీకైంది.  గురువారం రోజే హెచ్‌డీ వర్ష‌న్ ఆన్ లైన్‌లో  ద‌ర్శ‌న‌మివ్వ‌డం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జూలై 21న థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ మూవీ భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

(ఇది చదవండి: ఏడాదిగా వెయిటింగ్‌.. ఎస్‌ చెప్పిన పవిత్ర.. నిశ్చితార్థం ఫోటో వైరల్‌)

అణుబాంబును క‌నిపెట్టిన సైంటిస్ట్ ఓపెన్‌హైమ‌ర్ జీవితం ఆధారంగా క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. అణుబాంబును క‌నిపెట్ట‌డంలో ఓపెన్‌హైప‌ర్ ఎదురైన సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. కాగా.. ఈ చిత్రంలో  సిలియ‌న్ మ‌ర్ఫీ, రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్‌, మాట్ డామ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

(ఇది చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement