ఆస్కార్‌ వర్సెస్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ | Oscar awards vs golden Globe awards | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ వర్సెస్‌ గోల్డెన్‌ గ్లోబ్‌

Published Mon, Jan 22 2018 12:14 AM | Last Updated on Mon, Jan 22 2018 12:14 AM

Oscar awards vs  golden Globe awards - Sakshi

సొయర్స్‌ రోనన్‌, ఫ్రాన్సెస్‌ మెక్‌డొర్మాండ్‌

ఏటా లక్షలాది మంది ఆ అవార్డు వేడుక వస్తోందంటే టీవీల ముందు వాలిపోతుంటారు. ఒక్కో క్యాటగిరీల్లో అవార్డులు అనౌన్స్‌ అవుతూంటే.. ‘‘అండ్‌ ది అవార్డ్‌ గోస్‌ టూ..’’ అనగానే కళ్లన్నీ అప్పగించి చూస్తూంటారు. వాళ్లకిష్టమైన సినిమాకో, నటుడికో, టెక్నీషియన్‌కో అవార్డు వస్తే ఇక పండగే! ప్రపంచవ్యాప్తంగా ఆ స్థాయి క్రేజ్‌ తెచ్చుకున్న అవార్డు ‘ఆస్కార్‌’. ఆస్కార్‌ అనేది హాలీవుడ్‌ సినిమాకు ఒక బ్రాండ్‌. ఆ బ్రాండ్‌ తమ సినిమాకు దక్కాలని అందరు ఫిల్మ్‌మేకర్స్‌ కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆస్కార్‌ అవార్డ్స్‌ అనౌన్స్‌ చేస్తున్నారంటే అభిమానులకు అదొక పండగ. సినిమాను సెలెబ్రేట్‌ చేసుకునే పండగ. వారం క్రితమే 2017 సంవత్సరానికి సంబంధించిన ఆస్కార్‌ నామినేషన్స్‌ను స్వీకరించే ప్రక్రియ పూర్తయింది.

రేపు (జనవరి 23) నామినేషన్స్‌ ప్రకటిస్తారు. మార్చి 4న అవార్డుల ప్రదానం. ఇంకా చాలా టైమ్‌ అయితే ఉంది. కానీ సందడి మాత్రం ఇప్పటికే మొదలైపోయింది. ముఖ్యంగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానం కూడా జరిగిపోయాక ఆస్కార్‌ సందడి ఎక్కువయింది. హాలీవుడ్‌లో ఆస్కార్‌ స్థాయిని మించింది ఇంకేదీ లేకపోయినా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను కూడా ఓ రకంగా గొప్ప అవార్డులుగానే చెప్పుకుంటారు. ఆస్కార్‌ కంటే ముందే ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది కాబట్టి ప్రతిసారీ ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు వేడుక అయిపోయిన రోజు నుంచీ ఆస్కార్‌ వరుస ఎలా ఉంటుందీ అన్న చర్చ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 7న గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానం జరిగిపోయింది. ఇక అప్పట్నుంచీ గోల్డెన్‌ గ్లోబ్‌లో సత్తా చాటిన సినిమాలే ఆస్కార్‌లోనూ సత్తా చాటుతాయా అన్న చర్చ మొదలైంది.

ఇక ఇక్కడే ప్రధానంగా అర్థమవుతోన్న విషయం ఏంటంటే.. ఆస్కార్‌కు, గోల్డెన్‌ గ్లోబ్‌కు చాలా తేడా ఉండడం. గోల్డెన్‌ గ్లోబ్‌ బెస్ట్‌ పిక్చర్‌ అనిపించుకున్న సినిమా, ఆస్కార్‌లో కనిపించకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది గోల్డెన్‌ గ్లోబ్‌లో ‘త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి’ అనే సినిమా బెస్ట్‌ ఫిల్మ్‌గా డ్రామా జానర్‌లో అవార్డ్‌ అందుకుంది. ఇక కామెడీ/మ్యూజికల్‌ జానర్‌లో ‘లేడీబర్డ్‌’ బెస్ట్‌ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా ఆస్కార్‌ అవార్డు అందుకుంటుందా? చెప్పలేం! ఇప్పటికైతే సినీ విశ్లేషకులు ఈ రెండు సినిమాలూ కాకుండా ఆస్కార్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ అందుకునే సినిమా ‘షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ కానీ, ‘ది పోస్ట్‌’ కానీ, ‘డంకర్క్‌’ కానీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆశ్చర్యంగా ఈ రెండిట్లోనే ఏదో ఒక సినిమాయే ఆస్కార్‌నూ అందుకోవచ్చు కూడా! నామినేషన్స్‌లో ఎలాగూ పైన చెప్పుకున్న సినిమాలన్నీ ఉండొచ్చు. మరి అందులో ఆస్కార్‌ను అందుకునే సినిమా ఏదో తెలియాలంటే మార్చి 4 వరకూ ఎదురుచూడాల్సిందే!!

► గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు సినిమాలతో పాటు టీవీ సిరీస్‌లకు కూడా ఇస్తూంటారు.
► గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను హాలీవుడ్‌ ఫారిన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ ప్రదానం చేస్తుంది.
► గోల్డెన్‌ గ్లోబ్‌లో ఓటర్లు 90 మంది మాత్రమే.

► ఆస్కార్స్‌ కేవలం సినిమాలకు మాత్రమే.
► ఆస్కార్‌ అవార్డులను అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ప్రదానం చేస్తుంది.
► ఆస్కార్స్‌లో 6,000మంది ఓట్లను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు.

గోల్డెన్‌ గ్లోబ్‌ 2018 విన్నర్స్‌ లిస్ట్‌
ఉత్తమ చిత్రం (డ్రామా)
త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి
ఉత్తమ చిత్రం (మ్యూజికల్‌/కామెడీ): లేడీబర్డ్‌
ఉత్తమ విదేశీ భాషా చిత్రం : ఇన్‌ ద ఫేడ్‌ (జర్మనీ)
ఉత్తమ దర్శకుడు: గిలియర్మొ దెల్‌తొరొ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌)
ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌
అలెగ్జాండర్‌ డెస్‌ప్లాట్‌ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌)
ఉత్తమ నటుడు (డ్రామా): గ్యారీ ఓల్డ్‌మేన్‌ (డార్కెస్ట్‌ అవర్‌)
ఉత్తమ నటుడు (కామెడీ/మ్యూజికల్‌)
జేమ్స్‌ ఫ్రాంకో (ది డిజాస్టర్‌ ఆర్టిస్ట్‌)
ఉత్తమ నటి (డ్రామా)
ఫ్రాన్సెస్‌ మెక్‌డొర్మాండ్‌ (త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి)
ఉత్తమ నటి (కామెడీ/మ్యూజికల్‌) : సొయర్స్‌ రోనన్‌ (లేడీ బర్డ్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే
మార్టిన్‌ మెక్‌డొనా (త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్, మిస్సోరి)

                                  గ్యారీ ఓల్డ్‌మేన్, ∙ జేమ్స్‌ ఫ్రాంకో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement