ఆర్ఆర్ఆర్ మూవీకి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దీనికి ఎమ్‌ఎమ్ కీరవాని అందుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటి ముందుకు మీడియా, అభిమానుల భారీగా తరలి వచ్చారు.
ఈ సందర్భంగా మీడియా, ఫ్యాన్స్ మధ్య రాహుల్ కేక్ కట్ చేసి ఈ గ్రేట్ మూమెంట్‌ను సెలబ్రెట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావాడం చాలా హ్యపీగా ఉంది. ఆ రేంజ్‌లో పాటకు గుర్తింపు వస్తుందని అనుకోలేదు. నన్ను నేను ఎప్పుడు గల్లీబాయ్‌గా పోల్చుకుంటా. కానీ ఇప్పుడు ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది. స్టేజ్‌పై కీరవాణి గారు నా పేరు చెప్పడం గర్వంగా అనిపిస్తుంది. మళ్లీ ఇలాంటి మూమెంట్ వస్తుందో రాదో తెలియదు. నా వాయిస్‌ను అంగీకరించిన ఆర్‌ఆర్‌ఆర్ టీం, కీరవాణి సార్, రాజమౌళి సార్, రమ మేడమ్ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి:
గోల్డెన్ గ్లోబ్ అవార్డు: ఆర్‌ఆర్‌ఆర్ టీంకి చిరు, ఏఆర్ రెహమాన్ శుభాకాంక్షలు
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆర్ఆర్‌ఆర్... అవార్డ్ వచ్చేసింది!
Comments
Please login to add a commentAdd a comment