సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో గురువారం కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నోటిషికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ విడతలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. రాష్ట్ర బీజేపీ నేతల నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరుకానున్నారు.
బీజేపీ అభ్యర్థుల నామినేషన్ తేదీల వివరాలు
18న మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్
- మెదక్ రఘునందన్ రావు నామినేషన్‌కు హజరు కానున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్
- మల్కాజ్ గిరి ఈటెల రాజేందర్ నామినేషన్‌కు హాజరు కానున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ
- మహబూబ్ నగర్ డికే అరుణ నామినేషన్‌కు పీయూష్ గోయల్
19న సికింద్రాబాద్, ఖమ్మం బీజేపీ అభ్యర్ధుల నామినేషన్‌లు
- కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్‌కు హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబ్ బాద్ బీజేపీ నేతల నామినేషన్‌లు
- జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్‌కు దేవేంద్ర ఫడ్నవీస్
- చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్‌కు పియుష్ గోయల్
- మహబూబాబాద్ సీతారాం నాయక్ నామినేషన్‌కు కిరణ్ రిజిజు
23న భువనగిరి, 24 న పెద్దపల్లి, అదిలాబాద్ ,హైదారాబాద్, వరంగల్ అభ్యర్ధుల నామినేషన్‌లు
- పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్
- అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్‌కు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి
- హైదారాబాద్ మాధవి లత నామినేషన్‌కు అనురాగ్ సింగ్ ఠాకూర్,
- వరంగల్ అరూర్ రమేష్ నామినేషన్‌కు అశ్వినీ వైష్ణవ్
25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్
- కరీంనగర్ బండి సంజయ్, నాగర్ కర్నూల్ భరత్ నామినేషన్‌కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డిలు.
- నిజామాబాద్ అరవింద్ నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్‌లు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment