అహద్మాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో నామినేషన్ వేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ డేట్స్ కూడా ఇచ్చేసింది. ఇప్పటికే చాలామంది నామినేషన్స్ కూడా వేసేసారు. అయితే ముహూర్తం దాటిపోయిందని ఓ బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పాటిల్ నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. నాయకుడు నామినేషన్ వేయడానికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అయితే ముహూర్తం దాటిపోయిందని పాటిల్ నామినేషన్ వేయకుండానే వెనక్కి వెళ్లి కార్యకర్తలకు నిరాశ కలిగించారు.
పాటిల్ ముందుగా అనుకున్నట్లు మధ్యాహ్నం 12.39 గంటలకు నామినేషన్ వేయాలి. అయితే ఆ సమయానికి అక్కడికి ఆయన చేరుకోలేకపోయారు. శుభ గడియలు మిస్ కావడంతో నామినేషన్ ఏప్రిల్ 19న వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment