నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
ఇప్పటివరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 654
రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగియ నుంది. బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో ఈ సారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఒకరోజు గడువు ఉండగానే బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 653 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్‌సభకు బుధవారం నామినేషన్లు వేసినవారిలో బీజేపీ తరఫున పురందేశ్వరి, జనసేన తరఫున వల్లభనేని బాలశౌరి,ఉదయ్ శ్రీనివాస్ తదితరులున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు రోజుల్లో..
25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 555 మంది 653 సెట్ల నామినేషన్లు దాఖలు.
- తొలిరోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు
- రెండోరోజు 68 సెట్ల నామినేషన్లు దాఖలు
- మూడో రోజు 40 సెట్ల నామినేషన్లు దాఖలు
- నాలుగోరోజు 112 సెట్ల నామినేషన్లు దాఖలు
- ఐదోరోజు 124 సెట్ల నామినేషన్లు దాఖలు
- ఆరోరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు
ఆరు రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 3057 మంది 3701 సెట్ల నామినేషన్లు దాఖలు
- తొలిరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు
- రెండోరోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలు
- మూడోరోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలు
- నాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలు
- ఐదోరోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలు
- ఆరోరోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు
Comments
Please login to add a commentAdd a comment