![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/17/muhurtam_mr_0.jpg.webp?itok=a_g7VXcQ)
నామినేషన్లకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
రేపటి నుంచి 25 వరకు నామినేషన్లు దాఖలుకు గడువు
18 నుంచి 24 సుముహూర్తాలు ఖరారు
సాక్షి, విశాఖపట్నం : నామినేషన్ల హడావుడి గురువారం నుంచి ప్రారంభమకానుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల సమర్పణకు అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ మధ్య కాలంలో ఏరోజు ముహూర్తం బాగుందో తెలుసుకుని, ఆరోజు నామినేషన్లు వేయాలని చాలామంది అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులు మంచి ముహూర్తాల కోసం పండితులు, సిద్ధాంతులను ఆశ్రయిస్తున్నారు. ఆయా అభ్యర్థుల జాతక చక్రాలు, నామ/జన్మ నక్షత్రాలకు అనుగుణంగా వీరు ముహూర్తాలను నిర్ణయిస్తున్నారు.
పంచాంగం ప్రకారం చూస్తే ఈనెల 18, 19, 22, 23, 24 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చాలావరకు ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల జాతకంలో రవి గ్రహం, రవి, కుజ, శని గ్రహాలు బలంగా ఉంటే విజయావకాశాలు మెండుగా ఉంటాయని చెబుతారు. అందువల్ల అలాంటి ముహూర్తాలు ఏ సమయంలో ఉన్నాయో పరిశీలించి నిర్ణయం జరుగుతుందని విశాఖకు చెందిన స్మార్త పురోహితుడు చేబియ్యం రవిశర్మ ‘సాక్షి’కి చెప్పారు. కొంతమంది అభ్యర్థులు మంచి ముహూర్తాలకు, మరికొందరు సెంటిమెంటుతో పాటు వారాలకు ప్రాధాన్యతనిస్తారని అందుకనుగుణంగా శుభగడియలను పడికట్టి ముహూర్తాలను నిర్ణయిస్తామని కేవీకే శాస్త్రి అనే మరో పురోహితుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment