నిర్ణీత గడువులోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం
విశాఖ సిటీ: నిర్ణీత కాలపరిమితిలోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. శనివారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్‌టీపీ)లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణ–2020 పథకానికి సంబంధించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చినట్లు చెప్పారు. వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రహదారులు, కల్వర్టులకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని చెప్పారు. అలాగే ఎల్‌టీపీల వ్యక్తిగత లాగిన్‌లో అధిక సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. షార్ట్‌ఫాల్ ఉన్న దరఖాస్తుల విషయంలో కూడా అవసరమైన సంబంధిత దస్త్రాలను వీఎంఆర్‌డీఏకు అందించి దరఖాస్తులను వేగంగా క్లియర్ చేసే విధంగా సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో సీయూపీ శిల్ప, ప్లానింగ్ అధికారులు చామంతి, అరుణవళ్లి, మౌనిక, కిషోర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment