జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ పత్రాలు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫొటోలు, ఇతర వివరాలను ఇక్కడి నుంచి అధికారులు పంపించగా, సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సోమవారం కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. 10 శాతం రిజర్వ్‌తో కలిపి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్యకు సరిపడా పత్రాలను అధికారులు సేకరించి భద్రపరిచారు. ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సంబంధిత వాహనానికి పోలీసులు, ఇతర లైజనింగ్ అధికారుల సమక్షంలో సీలు వేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపించారు.
స్పెషల్ పర్పస్ వెహికల్ కమిటీ ఏర్పాటు
అల్లిపురం: గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌లో భాగంగా స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ) కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా మున్సిప ల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా కలెక్టర్, డైరెక్టర్‌గా వీఎంఆర్‌డీఏ కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జీవీఎంసీ కమిషనర్, డైరెక్టర్లుగా జీవీఎంసీ అడిషనల్ కమిషనర్, చీఫ్ ఇంజినీర్‌తో పాటు మరో ఇద్దరు వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment