20 నుంచి ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–లోకమాన్య తిలక్ టెర్మినస్– విశాఖపట్నం మధ్య నడిచే లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. విశాఖపట్నం–లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20 నుంచి, లోకమాన్య తిలక్ టెర్మినస్–విశాఖపట్నం(18520) ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 22 నుంచి యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.
శ్రీకాకుళం రోడ్–చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు
చర్లపల్లి–శ్రీకాకుళంరోడ్–చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్(07025) స్పెషల్ ఈ నెల 21న చర్లపల్లిలో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.47 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం రోడ్ వెళ్తుంది. శ్రీకాకుళం రోడ్–చర్లపల్లి(07026) స్పెషల్ ఈ నెల 22న మధ్యాహ్నం 2.15 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి సాయంత్రం 4.45గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 4.47 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి వెళ్తుంది.
పలు రైళ్లు రద్దు...
ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 19న విశాఖపట్నం–షాలిమర్(22854) ఎక్స్‌ప్రెస్, 21న సంత్రగచ్చి–ఎంీజీఆర్ చైన్నె సెంట్రల్ (22807) ఎక్స్‌ప్రెస్, 23న ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(22808) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment