ఇసుక.. ఎవరూ కొనట్లే.!
ముడసర్లోవ స్టాక్ పాయింట్‌లో 2,840 టన్నుల ఇసుక నిల్వలు
ఆరిలోవ: ముడసర్లోవ వద్ద ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్‌కు వినియోగదారుల నుంచి స్పందన కరువైంది. ఇక్కడ నుంచి ఇసుక కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక గత ఏడాది డిసెంబర్ 12న ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా గార ఇసుక రీచ్ నుంచి లారీలతో ఇక్కడకు 3,480 టన్నుల ఇసుక తీసుకు వచ్చి నిల్వ ఉంచారు. అయితే ఇక్కడ ఇసుక విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇంతవరకు కేవలం 640 టన్నుల ఇసుక మాత్రమే ఇక్కడ విక్రయించారు. ఈ లెక్క ప్రకారం రోజుకు సుమారు 11 టన్నుల ఇసుక చొప్పున వినియోగదారులు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ 2,840 టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులు ఇక్కడ ఇసుక కొనుగోలు చేయకుండా ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. కారణం ధరలో వ్యత్యాసమే.! ఇసుక స్టాక్ పాయింట్‌లో టన్ను రూ.700కు విక్రయిస్తుండగా, ప్రైవేట్ వ్యాపారుల వద్ద టన్ను రూ.650కే లభిస్తోంది. అందుకే ఇటు వైపు రావడం లేదు. బిల్లుతో పాటు కొలతలో ఎటువంటి తేడా లేకుండా విక్రయిస్తామని చెబుతున్నా.. ఈ స్టాక్ పాయింట్ వైపు రాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment