AP: తొలిరోజే భారీగా నామినేషన్లు | Huge nominations on the first day | Sakshi
Sakshi News home page

AP: తొలిరోజే భారీగా నామినేషన్లు

Published Fri, Apr 19 2024 5:46 AM | Last Updated on Fri, Apr 19 2024 7:25 AM

Huge nominations on the first day - Sakshi

లోక్‌సభకు 39 మంది అభ్యర్థులు 43 సెట్లు.. 

అసెంబ్లీకి 190 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, శాసన­సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన తొలి­రోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్‌సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

తొలిరోజు పార్లమెంటుకు నామినే­షన్లు దాఖలు చేసిన ముఖ్యుల్లో వైఎస్సార్‌సీపీ తరఫున రాజంపేట నియోజకవర్గం నుంచి పి.మిథున్‌రెడ్డి, హిందూపురం నుంచి జె.శాంత, తెలుగుదేశం తరఫున నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు (ఎస్సీ) నుంచి డి.ప్రసాదరావు ఉన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 190 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

అసెంబ్లీకి నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఆళ్ల నాని, అనంత వెంకటరామిరెడ్డి, ఎస్‌.చక్రపాణిరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, బుట్టా రేణుక, కేతిరెడ్డి పెద్దా­రెడ్డి, బూచేపల్లి, కొరుముట్ల శ్రీనివాసుల­రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, తెలుగుదేశం తరఫున పయ్యావుల కేశవ్, లోకేశ్, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, బీజేపీ తరఫున సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి తదితరులున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement