ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్న మాటను అందరూ పాటిస్తున్నట్లు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-7లో పదకొండో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. మొదటి రోజే బిగ్ బాస్ హౌస్‌ను గత వారంలో మహారాణుల పాత్ర పోషించిన నలుగురు హీటెక్కించేశారు. ఈసారి నామినేషన్ల పర్వంలో ఎప్పుడు లేనంతగా వాదనలు మొదలయ్యాయి. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ ప్రతి విమర్శలతో హాట్ హాట్‌గా సాగింది. రతికా, శోభా, ప్రియాంక, అశ్విని ఇలా వీరిలో ఎవరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు రైతుబిడ్డ, అంబటి అర్జున్ మధ్య ఏకంగా చిన్నపాటి వార్ నడిచింది.
ప్రస్తుతం పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో ఉండగా.. నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగనుంది. తాజాగా రెండో రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవీ చూస్తే రెండో రోజు హౌస్ మరింత హాట్ హాట్‌గా సాగినట్లు కనిపిస్తోంది. నామినేషన్ సమయంలో అమర్‌దీప్, యావర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
యావర్‌ను నామినేట్ చేస్తూ.. గతం తవ్వుకుంటే ఎవ్వరివీ అంతా పెద్ద జాతకాలు కావు ఇక్కడ అని అమర్ అన్నాడు. వీరిద్దరి మధ్యలో రతికా ఎంటర్ కావడంతో అమర్ మరింత రెచ్చిపోయాడు. స్ప్రైట్ కోసం నామినేషన్ చేశావంటూ యావర్‌ను అమర్ అనడంతో.. నామినేషన్ కోసం అమర్ చెప్పే పాయింట్ రెండో, మూడో వారానిదా అని యావర్‌తో రతిక అన్నారు. దీంతో అమర్, యావర్ మధ్య ఫైట్ మొదలైంది. ఆ తర్వాత ఒకరినొకరు మీది మీదికి దూసుకొచ్చారు.
రారా..నువ్వు రా.. అంటూ కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో ఇద్దరి మధ్యలో శివాజీ ఎంటరై సర్ది చెప్పాలిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అమర్ కావాలి.. అమర్ పోవాలి.. అంటూ గట్టిగా వెటకారంగా స్లోగాన్స్ ఇచ్చాడు అమర్. పాత విషయాన్ని గుర్తు చేసి.. నిజంగా వేయాలంటే.. నిన్ను అప్పుడే నామినేషన్స్‌లో వేసేసేవాడినని అమర్ అన్నారు. ఆ తర్వాత ఎమోషన్ ఇజ్ ది లూజ్ మోషన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్.. ఆ ఫ్లోను మనం కంట్రోల్ చేయలేం అని గౌతమ్ అనగా.. అది కంట్రోల్ చేసుకోవాలిరా.. మంచిదిరా అని కెప్టెన్ శివాజీ అనడంతో ప్రోమో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment