‘‘సమయం లేదు మిత్రమా’’.. అంటూ రాజకీయ నేతలు త్వరపడాల్సిన టైం వచ్చింది.
హైదరాబాద్, సాక్షి: ‘‘సమయం లేదు మిత్రమా’’.. అంటూ రాజకీయ నేతలు త్వరపడాల్సిన టైం వచ్చింది. ఇటు తెలంగాణ లోక్‌సభ, అటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి తేదీ. దీంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. నాలుగో దశలో తెలంగాణ(17), ఏపీ(25) లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.
- తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటిదాకా(మంగళవారం నాటికి) 415 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
- ఏపీలో 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 417 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
- ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2 వేల 350 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
ఏప్రిల్ 18వ తేదీన నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. రేపటితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుంది. ఎల్లుండి.. అంటే 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment