ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి రెబల్ ఆప్ కౌన్సిలర్ 'నరేంద్ర కుమార్' తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. విజయ్ కుమార్ ఆ పదవికి సెల్ఫ్-నామినేట్ చేసిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం జరిగింది.
ఏప్రిల్ 18న, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నికలకు తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత , మేయర్ పదవికి మహేష్ ఖిచి, డిప్యూటీ మేయర్‌గా రవీందర్ భరద్వాజ్‌ని నిలబెట్టారు. అయితే కౌన్సిలర్లు విజయ్ కుమార్, నరేంద్ర మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా వారు నామినేషన్స్ దాఖలు చేశారు. కాగా ఇప్పుడు నరేంద్ర కుమార్ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
నరేంద్ర కుమార్ తన నామినేషన్‌ను ఎందుకు వెనక్కు తీసుకున్నారు అనేదానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. పార్టీ నుంచి తనకు ఎటువంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. పార్టీ ఎంపికకు వ్యతిరేఖంగా ఎందుకు నామినేషన్ వేశారు అనే దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నరేంద్ర కుమార్ వార్డు-119 మంగళపురి కౌన్సిలర్ కాగా, విజయ్ కుమార్ వార్డు-192 త్రిలోకపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment