Narendra Kumar
-
నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ కౌన్సిలర్
ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి రెబల్ ఆప్ కౌన్సిలర్ 'నరేంద్ర కుమార్' తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. విజయ్ కుమార్ ఆ పదవికి సెల్ఫ్-నామినేట్ చేసిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం జరిగింది. ఏప్రిల్ 18న, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నికలకు తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత , మేయర్ పదవికి మహేష్ ఖిచి, డిప్యూటీ మేయర్‌గా రవీందర్ భరద్వాజ్‌ని నిలబెట్టారు. అయితే కౌన్సిలర్లు విజయ్ కుమార్, నరేంద్ర మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా వారు నామినేషన్స్ దాఖలు చేశారు. కాగా ఇప్పుడు నరేంద్ర కుమార్ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. నరేంద్ర కుమార్ తన నామినేషన్‌ను ఎందుకు వెనక్కు తీసుకున్నారు అనేదానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. పార్టీ నుంచి తనకు ఎటువంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. పార్టీ ఎంపికకు వ్యతిరేఖంగా ఎందుకు నామినేషన్ వేశారు అనే దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నరేంద్ర కుమార్ వార్డు-119 మంగళపురి కౌన్సిలర్ కాగా, విజయ్ కుమార్ వార్డు-192 త్రిలోకపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
దక్షిణాది టాప్ డాక్టర్స్ జాబితాలో నరేంద్రకుమార్
వనపర్తి : మూడు దశాబ్దాలుగా పీడియాట్రిక్ సర్జన్‌గా వైద్యసేవలందిస్తున్న వనపర్తి జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రకుమార్‌కు ఇండియాటుడే విడుదల చేసిన దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యుత్తమ వైద్యుల జాబితాలో స్థానం లభించింది. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్లో ఆయనకు అభినందనలు తెలిపారు. 1991లో పిల్లల వైద్య నిపుణుడిగా వృత్తిలో చేరిన నరేంద్రకుమార్ వేలాది మంది చిన్నారులకు చికిత్స చేశారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో 22 సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించి, 30 వేల శస్త్రచికిత్సలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యుత్తమ వైద్యుల జాబితాలో ప్రభుత్వ వైద్యుడిగా తెలంగాణ నుంచి మొదటి స్థానం దక్కించుకున్న నరేంద్రకుమార్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
నైట్వుడ్స్ బ్రోచర్ లాంచింగ్
సాక్షి, హైదరాబాద్: లగ్జరీ విల్లాల నిర్మాణంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్.. మరొక అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. గురువారం జూబ్లీ్లహిల్స్లోని ప్రణీత్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో నైట్వుడ్స్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. జీహెచ్ఎంసీ అనుమతి పొందిన గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ నైట్వుడ్స్. బీరంగూడలో 30 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 459 ప్రీమియం విల్లాలుంటాయని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్రకుమార్ కామరాజు తెలిపారు. 150 నుంచి 213 గజాలలో, 1,800–2,441 చ.అ. బిల్టప్ ఏరియాలో విల్లా విస్తీర్ణాలు ఉంటాయి. ధర చ.అ.కు రూ.7,500. నైట్వుడ్స్ ప్రణీత్ గ్రూప్ నుంచి వస్తున్న 25వ ప్రాజెక్ట్. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కేవీఎస్ నర్సింగరావు, పీ రామాంజనేయ రాజు, చంద్రశేఖర్ రెడ్డి బక్కిరెడ్డి, ఆదిత్య కామరాజు, దినేష్ రెడ్డి సప్పిడి, సందీప్‌రావ్ మాధవరంలు పాల్గొన్నారు. -
‘అందరూ ఇలా చేస్తే సెకండ్ వేవ్‌ను అడ్డుకోవచ్చు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర నగరాల్లో కల్లోలాన్ని సృష్టిస్తున్న కరోనా మహమ్మారి సంక్రమణ కట్టడి సాధ్యమే అని ఐసీఎంఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కానీ గతంలో మాదిరిగా భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్–19 కోసం ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌లోని ఆపరేషనల్ రీసెర్చ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఏమాత్రంలేదని పేర్కొన్నారు. అంతేగాక సంక్రమణను అడ్డుకొనేందుకు వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో, సూక్ష్మ స్థాయిలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, మాస్క్ ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దుమ్ము నుంచి కాపాడుకొనేందుకు కండువాలు మొహానికి అడ్డంగా పెట్టుకోవడం, మహిళలు చున్నీల వంటి వస్త్రాలను ధరించడం ఆనవాయితీగా వస్తోందని, ఇలా కూడా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు కరోనా విషయంలో ప్రజల్లో చాలా భయం ఉండేది. పండ్లు, కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన తరువాత కనీసం ఐదారు గంటలు పక్కన పెట్టేవారు. అయితే నెమ్మదిగా ప్రజల్లో కరోనా భయం పోయిందని, కరోనాను నివారించడానికి ప్రజల్లో కనీసం ఉండాల్సిన భయం తప్పనిసరి అని డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు కచ్చితంగా ఉపయోగించడం కొనసాగిస్తే, కరోనా సెకండ్ వేవ్ మూడు, నాలుగు వారాల్లో ఆగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరాల్లో ఉద్యోగులు ఆఫీసుల్లో ఒకచోట కలిసి కూర్చొనే పరిస్థితుల్లో, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలనిన్నారు. కేవలం ఎన్–95 మాస్క్‌లు మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న క్లాత్ మాస్క్‌లను అయినా వాడుకోవచ్చన్నారు. మాస్క్‌లను ధరించడం, చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడటం దైనందిన జీవితంలో భాగం కావాలని తెలిపారు. -
ఇక్కడ ఇళ్లు కొనేది ఉండటానికే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అన్ని రంగాలూ కరోనా వైరస్ దెబ్బకి విలవిల్లాడుతున్నాయి. రియల్టీ మరీనూ! ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌కు చెందిన ప్రణీత్ గ్రూప్ రెండు భారీ ప్రాజెక్ట్‌లను ఆరంభించింది. అదే విషయాన్ని గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజును అడిగితే... అందుబాటు ధర, నాణ్యత, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగిన వారికి ఎప్పుడూ విక్రయాలకు ఇబ్బంది ఉండదని చెప్పారు. రియల్టీకి చెందిన పలు అంశాలను సాక్షితో పంచుకున్నారు. అవి.. ►కరోనా నేపథ్యంతో పాత ప్రాజెక్ట్‌లను పూర్తి చేయటమే కష్టమంటున్నారు కదా? కొంత నిజమే!!. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రా రంభమయ్యాక.. అంతకుముందు జరిగిన అగ్రిమెంట్లు రద్దవుతాయని, కొత్త యూనిట్ల విక్రయాలు జరగవని అందరిలాగే మాకూ సందేహాలొచ్చాయి. కానీ, లాక్డౌన్ ముగిసి అన్నీ తెరుచుకుంటున్న సందర్భంలో పరిస్థితి మా రింది. అందుబాటు ధర, నిర్మాణంలో నాణ్యత, సమయానికి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయగలిగితే కస్టమర్లు ఆదరిస్తారనే నమ్మకం మొదటి నుంచీ ఉంది. ఆ భరోసాతోనే కొత్త ప్రాజెక్టులు ఆరంభించాం. లాక్డౌన్ ముగిశాక ప్రతి వారం 80–100 వాకిన్స్ వస్తున్నాయి. కొన్ని యూనిట్లు విక్రయమయ్యాయి కూడా. ►కరోనాతో కార్మికుల కొరత లేదా? కరోనా పేరు చెప్పి ధరలు పెంచని రంగమంటూ ఏదైనా ఉంటే అది రియల్టీయే. నిజానికి ఇప్పుడున్న ధరలకు విక్రయించినా డెవలపర్లకు లాభమే. ఎందుకంటే 2008–12 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా లేనంతగా ప్రస్తుతం గృహ రుణ వడ్డీ రేట్లు 6 నుంచి 7 శాతానికి దిగివచ్చాయి. తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనం మొట్ట మొదట అందేది డెవలపర్లకే. ఇక కరోనా వల్ల కార్మికుల సమస్య పెరిగిందని చెప్పలేం. ఎందుకంటే ఏటా రంజాన్, వర్షాకాలం ప్రారంభంలో ఇతర రాష్ట్రాల కార్మికులు సెలవుల మీద వెళతారు. ఈసారి ఇంకాస్త ముందు వెళ్లారనుకోవాలి. యజమానులు కాస్త చొరవ చూపించి ప్రోత్సాహకాలిస్తే వచ్చే నెల రోజుల్లో వారు తిరిగి తమ పనుల్లోకి వస్తారు. ►అయితే ఖర్చులు పెరగలేదంటారా? కార్మికుల వ్యయం, నిర్మాణ సామగ్రి ధరలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులు పెరిగాయన్నది నిజం. మేమైతే కరోనా కంటే ముందున్న ధరలకే విక్రయిస్తున్నాం. దీనికింకో కారణం కూడా ఉంది. అదేంటంటే... వీలైనంత వరకూ హ్యూమన్ టచ్ లేకుండా టెక్నాలజీని వినియోగించడాన్ని కరోనా నేర్పించింది. దీనివల్ల నిర్మాణ వ్యయం కొంత పెరిగినా ప్రాజెక్ట్ త్వరగా పూర్తవుతుంది. వృథా తగ్గుతుంది. ►హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఎలా ఉండొచ్చు? దేశంలోని ఇతర మెట్రోలకు, హైదరాబాద్ రియల్టీకి తేడా ఉంది. ఇక్కడ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ. ఇళ్లు కొనేది అద్దెల కోసమో లేక ధర ఎక్కువ వచ్చినప్పుడు తిరిగి అమ్ముకోవటానికో కాదు. సొంతంగా ఉండేందుకు కొనేవారే ఎక్కువ. వీళ్లకు కావాల్సిందల్లా.. అందుబాటు ధర, నాణ్యత, బిల్డర్ ట్రాక్ రికార్డ్, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి అంతే. -
సాయం కోసం 12గంటల ఎదురుచూపు..
సాక్షి న్యూఢిల్లీ: మానవత్వం మంటకలిసిపోయింది. రోడ్డు ప్రమాదంలో త్రీవంగా గాయపడిన వ్యక్తి సహాయం కోసం బాధితుడు సుమారు 12గంటల పాటు ఎదురు చూశాడంటే ఎంతటి దౌర్భాగ్యం. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన్న నిస్సహాయంగా పడి ఉన్న వ్యక్తిని స్థానికులు, ప్రయాణికులు ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు ఓ వ్యక్తి సహాయం చేస్తానంటూ వచ్చి, అతడి వద్ద నుంచి అందినకాడికి దోచుకుపోయాడు. ఈ విషాదకర ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళ్లే నరేంద్రకుమార్(35) ఉత్తరప్రదేశ్‌లోని బిజునూర్కు చెందిన డ్రైవర్. పనిమీద జైపూర్‌కు వచ్చిన నరేంద్రకుమార్ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. సాయంత్రం 5గంటలకు ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ బస్ టెర్మినల్ దగ్గరికి రాగనే కుమార్ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో నరేంద్రకుమార్‌కు మెడ, కాళ్లు, గొంతులకు తీవ్రగాయాలయ్యాయి. అయితే పక్కనే వెళ్తున్న వారు కనీసం పట్టించుకోనుకూడా పట్టించుకోలేదు. పైగా ఓ వ్యక్తి మంచినీళ్ల బాటిల్ ఇచ్చి నిస్సాహాయ స్థితిలోఉన్న అతని వద్ద నుంచి రూ.12వేలు, ఫోన్‌ను చోరీ చేసి తీసుకెళ్లిపోయాడు. చివరగా ప్రమాదంపై స్పందించిన ఓవ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. నరేంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గర్భవతిని 150 అడుగుల కొండమీంచి తోసేసినా...
జైపూర్ : ప్రేమించాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... గర్భం దాల్చిన అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. అది ఏమంత కష్టంలే అనుకున్నాడో ఏమో కానీ... లేని ప్రేమ ఒలకబోసి నాలుగు నెలల గర్భవతిని సమీపంలోని కొండమీదకు తీసుకెళ్లాడు. అదను చూసి ఆమెపై ఎటాక్ చేసి ముఖంపై రాయితో తీవ్రంగా కొట్టాడు. 50 అడుగుల దూరం ఈడ్చుకెళ్లి.. 150 అడుగుల కొండ మీద నుంచి తోసేశాడు. కొండలమాటున దాగిన పొదలు వాడి మోసాన్ని పసిగట్టాయి. అందుకే కొండ మీద నుంచి జారిపోతున్న 22 ఏళ్ల ఆ అమ్మాయిని ఒడిసి పట్టుకుని కడుపులో దాచుకున్నాయి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు... ప్రస్తుతం ఆమె ఆసుప్రతిలో కోలుకుంటోంది. వివరాల్లోకి వెడితే.. రాజస్థాన్ జైపూర్‌లో కూరగాయల వ్యాపారం చేసే నరేంద్రకుమార్ బ్యూటీ పార్లర్లో పనిచేసే అమ్మాయితో పరిచయం పెంచుకుని... ప్రేమ వల విసిరాడు. ఫలితం ఆ అమ్మాయి గర్భం దాల్చింది. దీంతో కంగారుపడ్డ అతగాడు అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాడు. కాదు.. పెళ్లి చేసుకుందామని అమ్మాయి పట్టుబట్టడంతో నరేంద్ర పథకం ప్రకారం కొండమీదకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పొదల్లో చిక్కుకుపోయిన దాదాపు 12 గంటల తరువాత స్పృహలోకి వచ్చిన ఆమె సహాయం కోసం అరవడం మొదలు పెట్టింది. అరుపులు విన్నవారు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతనిపై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
అప్పటిదాకా ఆనందం... అంతలోనే విషాదం..
అప్పటిదాకా ఆనందోత్సాహాలతో కళకళలాడిన ఆ ఇంట... అంతలోనే, మిన్నంటిన రోదనలతో అంతులేని విషాదం అలుముకుంది. కొత్తగూడెంలోని హనుమాన్ బస్తీకి చెందిన వస్త్ర వ్యాపారి బూదాటి వెంకటేశ్వరరావు చిన్న కుమారుడు కిషోర్(26) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో ఇతని అన్న నరేంద్రకుమార్(28) తీవ్రంగా గాయపడ్డాడు. ఇతని వివాహం ఈ నెల 15న జరగాల్సుంది. ఖమ్మం క్రైం: నగరంలోని శ్రీశ్రీ విగ్రహం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు గురువారం మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఓ టీవీ చానల్లో స్క్రోలింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కొత్తగూడెం పట్టణానికి చెందిన బూదాటి కిషోర్(25), తన అన్న నరేందర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తున్నాడు. నగరంలోని బైపాస్ రోడ్డులోగల శ్రీశ్రీ విగ్రహం సర్కిల్ వద్ద స్పీడ్ బ్రేకర్ కనిపించకపోవడంతో మోటార్ సైకిల్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కిషోర్, నరేందర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కిషోర్ గురువారం ఉదయం మృతి చెందాడు. నరేందర్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం విజయవాడలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆనందం... ఆవిరి.. లక్ష్మిదేవిపల్లి: కొత్తగూడెంలోని హనుమాన్ బస్తీకి చెందిన వస్త్ర వ్యాపారి బూదాటి వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు నరేంద్ర కుమార్(28) షేర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు కిషోర్(26) హైదరాబాద్‌లోని టీవీ చానల్లో స్క్రోలింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నరేందర్ వివాహం ఈ నెల 15వ తేదీన జరగాల్సుంది. ఖమ్మంలోని బంధు మిత్రులకు పెళ్లి కార్డులు పంచేందుకని నరేందర్ బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. కిషోర్ కూడా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చాడు. వీరిద్దరూ కలిసి బుధవారం రాత్రి పది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కొత్తగూడెం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కిషోర్ మృతి వార్త విన్నంతనే తల్లి స్పృహ కోల్పోయింది. ఇంటిలోని కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ప్రమాద వార్తతో హనుమాన్ బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఇంద్రానగర్‌లో ప్రణీత్ ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ హైదరాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలకు ఆదరణ పెరుగుతోందని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ చెప్పారు. ఇటీవల ప్రణీత్ ప్రణవ్ ఆంటిలియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రాజెక్ట్ వివరాలను ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. బాచుపల్లి సమీపంలోని ఇంద్రానగర్‌లో 50 ఎకరాల్లో ప్రణీత్ ప్రణవ్ ఆంటిలియా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. మొత్తం 600లకు పైగానే విల్లాలొస్తాయి. వీటి విస్తీర్ణాలు 120 గజాల నుంచి 300 గజాల మధ్య ఉంటాయి. రూ.60 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య వీటి ధరలున్నాయి. ఈనెల చివరి వరకు విల్లాను కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు హోమ్ ఆటోమేషన్‌ను ఉచితంగా ఇవ్వడంతో పాటు చ.అ. కు రూ.300 డిస్కౌంట్ ను అందుకోవచ్చు. 35 వేల చ.అ. విస్తీర్ణంలో క్లబ్ హౌస్ నిర్మిస్తుండమే కాకుండా మొత్తం విస్తీర్ణంలో 45 శాతం ఓపెన్ ప్లేస్‌కు, 13 శాతం పచ్చదనానికి కేటాయించాం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్‌ను ఆనుకొనే మరో 10 ఎకరాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌ను కూడా చేపడతాం. గోపన్‌పల్లిలో ఆరున్నర ఎకరాల్లో ప్రణవ్ ప్రైడ్‌ను నిర్మించనున్నాం. మొత్తం 60 విల్లాలు. ధరను రూ.1.8 కోట్ల నుంచి రూ.3 కోట్లుగా నిర్ణయించాం. బీరంగూడలో 35 ఎకరాల్లో ప్రణవ్ పనోరమా ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించనున్నాం. మొత్తం 400 విల్లాలు. ధర రూ.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ఆదిభట్ల, వెలిమల, కొల్లూరుల్లో కూడా లగ్జరీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తాం.