గర్భవతిని 150 అడుగుల కొండమీంచి తోసేసినా... | Pregnant woman miraculously survives after her boyfriend pushes off150-ft cliff, | Sakshi
Sakshi News home page

గర్భవతిని 150 అడుగుల కొండమీంచి తోసేసినా...

Published Sat, Apr 18 2015 10:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

Pregnant woman miraculously survives  after her boyfriend pushes off150-ft cliff,

జైపూర్ :  ప్రేమించాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... గర్భం దాల్చిన అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. అది ఏమంత కష్టంలే అనుకున్నాడో ఏమో కానీ... లేని ప్రేమ ఒలకబోసి నాలుగు నెలల గర్భవతిని సమీపంలోని కొండమీదకు తీసుకెళ్లాడు.  అదను చూసి ఆమెపై ఎటాక్ చేసి ముఖంపై రాయితో తీవ్రంగా కొట్టాడు. 50 అడుగుల దూరం ఈడ్చుకెళ్లి.. 150 అడుగుల కొండ మీద నుంచి తోసేశాడు. కొండలమాటున దాగిన పొదలు వాడి మోసాన్ని పసిగట్టాయి. అందుకే కొండ మీద నుంచి జారిపోతున్న 22 ఏళ్ల ఆ అమ్మాయిని ఒడిసి పట్టుకుని కడుపులో దాచుకున్నాయి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు... ప్రస్తుతం ఆమె ఆసుప్రతిలో కోలుకుంటోంది.


వివరాల్లోకి వెడితే.. రాజస్థాన్ జైపూర్లో కూరగాయల వ్యాపారం చేసే నరేంద్రకుమార్ బ్యూటీ పార్లర్లో పనిచేసే అమ్మాయితో పరిచయం పెంచుకుని... ప్రేమ వల విసిరాడు. ఫలితం ఆ అమ్మాయి గర్భం దాల్చింది. దీంతో కంగారుపడ్డ అతగాడు అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాడు.  కాదు.. పెళ్లి చేసుకుందామని అమ్మాయి పట్టుబట్టడంతో  నరేంద్ర పథకం ప్రకారం కొండమీదకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పొదల్లో చిక్కుకుపోయిన దాదాపు 12 గంటల తరువాత స్పృహలోకి వచ్చిన ఆమె సహాయం కోసం అరవడం మొదలు పెట్టింది. అరుపులు విన్నవారు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ప్రస్తుతం ఆమె  ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై  వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతనిపై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement