సాయం కోసం 12గంటల ఎదురుచూపు..
సాక్షి న్యూఢిల్లీ: మానవత్వం మంటకలిసిపోయింది. రోడ్డు ప్రమాదంలో త్రీవంగా గాయపడిన వ్యక్తి సహాయం కోసం బాధితుడు సుమారు 12గంటల పాటు ఎదురు చూశాడంటే ఎంతటి దౌర్భాగ్యం. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన్న నిస్సహాయంగా పడి ఉన్న వ్యక్తిని స్థానికులు, ప్రయాణికులు ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు ఓ వ్యక్తి సహాయం చేస్తానంటూ వచ్చి, అతడి వద్ద నుంచి అందినకాడికి దోచుకుపోయాడు. ఈ విషాదకర ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళ్లే నరేంద్రకుమార్(35) ఉత్తరప్రదేశ్‌లోని బిజునూర్‌కు చెందిన డ్రైవర్. పనిమీద జైపూర్‌కు వచ్చిన నరేంద్రకుమార్ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. సాయంత్రం 5గంటలకు ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ బస్ టెర్మినల్ దగ్గరికి రాగనే కుమార్ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో నరేంద్రకుమార్‌కు మెడ, కాళ్లు, గొంతులకు తీవ్రగాయాలయ్యాయి. అయితే పక్కనే వెళ్తున్న వారు కనీసం పట్టించుకోనుకూడా పట్టించుకోలేదు. పైగా ఓ వ్యక్తి మంచినీళ్ల బాటిల్ ఇచ్చి నిస్సాహాయ స్థితిలోఉన్న అతని వద్ద నుంచి రూ.12వేలు, ఫోన్‌ను చోరీ చేసి తీసుకెళ్లిపోయాడు. చివరగా ప్రమాదంపై స్పందించిన ఓవ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. నరేంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.