municipal corporation of delhi
-
నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ కౌన్సిలర్
ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి రెబల్ ఆప్ కౌన్సిలర్ 'నరేంద్ర కుమార్' తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. విజయ్ కుమార్ ఆ పదవికి సెల్ఫ్-నామినేట్ చేసిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం జరిగింది. ఏప్రిల్ 18న, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నికలకు తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత , మేయర్ పదవికి మహేష్ ఖిచి, డిప్యూటీ మేయర్‌గా రవీందర్ భరద్వాజ్‌ని నిలబెట్టారు. అయితే కౌన్సిలర్లు విజయ్ కుమార్, నరేంద్ర మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా వారు నామినేషన్స్ దాఖలు చేశారు. కాగా ఇప్పుడు నరేంద్ర కుమార్ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. నరేంద్ర కుమార్ తన నామినేషన్‌ను ఎందుకు వెనక్కు తీసుకున్నారు అనేదానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. పార్టీ నుంచి తనకు ఎటువంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. పార్టీ ఎంపికకు వ్యతిరేఖంగా ఎందుకు నామినేషన్ వేశారు అనే దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నరేంద్ర కుమార్ వార్డు-119 మంగళపురి కౌన్సిలర్ కాగా, విజయ్ కుమార్ వార్డు-192 త్రిలోకపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
ఢిల్లీలో మరోసారి మేయర్ ఎన్నిక!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఈ నెలలోనే మరోసారి ఎన్నిక జరగనుంది. నాటకీయ పరిణామాలతో దాదాపు రెండు నెలల్లో మూడుసార్లు వాయిదా పడిన ఎన్నిక.. ఫిబ్రవరి చివరివారంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఆ ఎన్నికలో మేయర్‌గా విజయం సాధించారు కూడా. అయితే.. ఏప్రిల్‌లో ఎంసీడీ(Municipal Corporation of Delhi)కి మరోసారి ఎన్నిక జరగాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు కారణం ఏంటంటే.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం.. మార్చి 31వ తేదీతో ఎంసీడీ హౌజ్ కాలపరిమితి ముగుస్తుంది. కాబట్టి, మళ్లీ ఎన్నికలు నిర్వహించి కచ్చితంగా ఆ సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆప్ తరపున ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్‌నే మళ్లీ మేయర్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డిప్యూటీ మేయర్ పోస్ట్‌కు ఆప్ నుంచి మహమ్మద్ ఇక్బాల్ బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ మళ్లీ మేయర్ పదవికి అభ్యర్థులను బరిలో దింపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇంతకు ముందు నిలబెట్టిన రేఖా గుప్తా కాకుండా వేరే వ్యక్తిని నిలపాలని భావిస్తోందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులతో పాటు స్టాండింగ్ కమిటీ, వార్డ్ ఎన్నికలు.. ఇలా అన్నీ ఏప్రిల్‌లోనే జరగనున్నాయి. ఈ మేరకు మేయర్ కార్యాలయం, ఎన్నికల ప్రతిపాదనను మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు, అటు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి ఎన్నికల ప్రతిపాదిత ఫైల్ వెళ్తుంది. ఎల్జీ మేయర్ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిని నియమిస్తారు. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్, బీజేపీ 104 స్థానాలు దక్కించుకున్నాయి. మేయర్ ఎన్నిక పోలింగ్‌లో 34 ఓట్ల తేడాతో షెల్లీ ఒబెరాయ్ గెలిచారు. ఢిల్లీ మున్సిపల్ హౌజ్‌లో జరిగిన పోలింగ్‌లో.. బీజేపీకి 116 ఓట్లు పోలవ్వగా.. ఆప్‌కు 150 ఓట్లు పడ్డాయి. ఇక ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇదీ చదవండి: ఢిల్లీ మేయర్ ఓటింగ్: సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్.. ఏదైనా జరగొచ్చు! -
Delhi Mayor: మేయర్ ఎన్నిక వాయిదా!
ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్ ఎన్నికకు ముందర రసాభాస చోటు చేసుకుంది. నామినేటెడ్ కౌన్సిలర్లు ప్రమాణం చేసే సమయంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సంయమనం పాటించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) తోటి సభ్యులకు పిలుపు ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితి చల్లారకపోవడంతో ఎన్నిక నిర్వహణ కాసేపు వాయిదా వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. పది మంది నామినేటెడ్ కౌన్సిలర్లను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఎనుకున్నారు. అయితే వాళ్లను తమతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎన్నుకున్నారంటూ ఆప్ ఆరోపించింది. శుక్రవారం ఉదయం మేయర్ ఎన్నికకు ముందు వాళ్లు ప్రమాణం చేస్తుండగా.. ఆప్ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. దీంతో ఈ రసాభాస చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఓటమిపాలైనప్పటికీ.. మేయర్ పదవిని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీపడుతుండగా, బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. మరోవైపు బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ను ఆప్ నిలబెట్టనుంది. మరోవైపు డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం ఆప్ నుంచి ఆలె ముహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్‌లు, బీజేపీ నుంచి కమల్ బార్గీలు పోటీ పడుతున్నారు. #WATCH | Delhi: Huge ruckus at Civic Centre, before the commencement of voting for the Delhi Mayor elections, regarding swearing-in of nominated councillors. pic.twitter.com/BCz3HLC9qL — ANI (@ANI) January 6, 2023 బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు ముఖేష్ గోయల్ పేరును ఆప్ ప్రతిపాదించినప్పటికీ.. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం బీజేపీ అభ్యర్థినే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నియమించడం విశేషం. ఈ పరిణామంపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఈ ఎన్నికలను ఎల్జీ ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఎల్జీ సక్సేనాపై మండిపడ్డారు. సాధారణంగా గెలిచిన అభ్యర్థుల్లో సీనియర్ని ప్రొటెం స్పీకర్ లేదంటే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఎంపిక చేస్తారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు అందరిలోకెల్లా ముకేష్ గోయల్ సీనియర్. అందుకే ఆప్ ఆయన్ని హౌజ్ ఆఫ్ లీడర్‌గా నియమించుకుంది కూడా. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్, బీజేపీ 104 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 9 స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంది. తొలుత ఓటమి కారణంతో మేయర్ పదవికి పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. తదనంతర పరిణామాలతో ఎందుకనో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పోటీలోకి దిగుతున్నట్లు అభ్యర్థిని నిలిపింది. ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇదీ చదవండి: ఢిల్లీ మేయర్ ఓటింగ్: సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్.. ఏదైనా జరగొచ్చు! -
విషాదం : కరోనాతో భార్యాభర్తలు మృతి
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (డీఎంసీ)లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఉద్యోగిని (45) కరోనా కబలించింది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమంలో ఆమె మే 4 తేదీ వరకు పాల్గొన్నారు. అయితే కరోనా లక్షణాలకు కనిపించడంతో ఆమెకు పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో క్వారెంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్న తరుణంలోనే ఆదివారం మరణించారు. అయితే మే 3నే ఆమె భర్త కూడా కరోనా కారణంగానే కన్నుమూయడం విషాదం. మరోవైపు ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,542కి చేరింది. మృతుల సంఖ్య 73కి పెరిగింది. (కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు..) -
కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
-
కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం 1,800 స్కూళ్లకు సెలవు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలపై ఎన్జీటీ ఆగ్రహం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతోంది. ఢిల్లీలో వాహనాలు వెదజల్లుతున్న వాయువులతోపాటు నగరం చుట్టుపక్కలున్న పరిశ్రమలనుంచి వస్తున్న కాలుష్యంతో హస్తినలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొంతకాలంగా ప్రపంచ కాలుష్యనగరాల్లో ప్రధానంగా నిలిచిన ఢిల్లీలో.. గత మూడ్రోజులుగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. కాలుష్యాన్ని కొలిచే పరికరాలు, గాల్లో దుమ్ము, ధూళి, పొగ, రసాయనాలు ప్రమాదస్థాయిని మించిపోయినట్లు సూచించాయి. గాలి నాణ్యత, వాతావరణ అంచనా, పరిశోధన వ్యవస్థ (సఫర్) వెల్లడించిన వివరాల ప్రకారం.. 10 పర్టికులేట్ మ్యాటర్ (కాలుష్య స్థాయి) ఉండాల్సిన కాలుష్యం 500 మార్కును చేరింది. భారీ ఎత్తున కురుస్తున్న పొగమంచు, నగరంలో కాలుష్యం పెరిగిపోవటంతో.. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. శనివారం తన పరిధిలోని 1800 స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు ఎమ్సీడీ (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) ప్రకటించింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు శుక్రవారం కూడా సెలవు ప్రకటించాయి. మరికొన్ని స్కూళ్లు ఆవరణలో జరిగే ప్రార్థన, క్రీడల తరగతులను రద్దుచేశాయి. గుర్గావ్, ఢిల్లీలో శాఖలున్న శ్రీరామ్ స్కూలు సోమవారందాకా సెలవు ప్రకటించింది. 10, 12వ తరగతి విద్యార్థులలే హాజరుకావాలంది. భావితరానికి భయంకరమే! దేశరాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆందోళన వ్యక్తం చేసింది. రోజురోజుకూ తీవ్రమవుతున్న కాలుష్య సమస్య నివారణకు కేంద్రం, ఆప్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడింది. ఢిల్లీలో 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కాలుష్యం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మన పిల్లలకు ఎలాంటి భయంకరమైన భవిష్యత్‌ను ఇవ్వబోతున్నామో ఆలోచించుకోవాలనింది. ‘మీ కోసమో (అధికారులు), ప్రజల కోసమో కాదు. మనకోసం కాలుష్యాన్ని నివారించాలి. మనం ఏదైనా సాధించగలం. ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోంది’ అని ఎన్జీటీ చైర్పర్సన్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ప్రమాదకర వాయు కాలుష్యం, ప్రజల ఆరోగ్యంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం, అధికారులు ఏ మాత్రం బాధపడకుండా.. ఒకరినొకరు నిందించుకుంటున్నారని ఎన్జీటీ మండిపడింది. కాలుష్యం ఇంతగా పెరిగిపోతున్న నేపథ్యంలో పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను రోడ్లపై తిరగనివ్వొద్దంటూ మళ్లీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలుకాకపోడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. -
నేడు హీరోలు - రేపు విలన్లు
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన బడ్జెట్లో కొత్త పన్నులను వ్యతిరేకించడం ద్వారా ప్రజల దృష్టిలో హీరోలుగా పోజు పెట్టేందుకు బీజేపీ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే అదే బీజేపీ కౌన్సిలర్లు ఆస్తి పన్నును 50 శాతం, ఇంటి పన్నును మూడు శాతం పెంచడంతో పాటు మరికొన్ని పన్నుల భారాన్ని ప్రజలపై మోపుతారని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని మున్సిపల్ కార్పొరేషన్లు అధికారులను ‘విలన్లు’గా చూపేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్ష నాయకుడు ముఖేశ్ గోయల్ విమర్శించారు. కానీ అసలైన విలన్లు బీజేపీ కార్పొరేటర్లేనని వ్యాఖ్యానించారు. ‘‘గత ఏడాది కూడా వారు (బీజేపీ కార్పొరేటర్లు) ఇలాగే వ్యవహరించారు. ప్రతిపాదిత బడ్జెట్లో కొత్త పనులన్నింటినీ వ్యతిరేకించారు. కానీ ఆ తరువాత ఇంటిపన్ను పెంచడంతో పాటు కొత్త పనులు విధించారు’’ అని గోయల్ చెప్పారు. 2015-16 సంవత్సరానికి గాను ప్రతిపాదించిన పన్నులన్నింటినీ తాము వ్యతిరేకిస్తున్నామని ముఖేశ్ గోయల్ స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదించిన బడ్జెట్‌ను ఆమోదిస్తే పౌరుల జేబుకు మరో చిల్లు పడుతుందని అన్నారు. ఫార్మ్‌హౌస్‌లు, మోటెల్స్‌లో జరిగే వేడుకులపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను గోయల్ తీవ్రంగా ఖండించారు. పన్నుల విధింపు ప్రతిపాదనలను మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదిస్తే, వాటిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రోడ్లపై ఆందోళనకు దిగుతారని ఆయన హెచ్చరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ‘బేస్ యూనిట్’ విలువను 50 శాతం పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇది అమలులోకి వస్తే ఆస్తి పన్ను పెరుగుతుంది. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) తనపరిధిలోని ప్రాంతాలను ‘ఏ, బీ, సీ, డీ’లుగా వర్గీకరించింది. ప్రస్తుతం ‘ఏ’ ప్రాంతం పరిధిలోని కాలనీల్లో రూ.630 ఉన్న బేస్ యూనిట్ చార్జీల రూ.945కు పెరుగుతుంది. కొత్తగా సంక్షేమం, వృత్తి పన్నులను విధించాలని కూడా బడ్జెట్లో ప్రతిపాదించారు. ‘‘నగరంలో నిత్యం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందువల్ల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1957లోని సెక్షన్ 150 కింద సంక్షేమ పన్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’ అని బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ పన్ను ద్వారా కార్పొరేషన్‌కు రూ.5 కోట్లు ఆదాయం లభించగలదని ఎన్డీఎంసీ కమిషనర్ పీకే గుప్తా చెప్పారు. ప్రతిపాదిత రేట్ల ప్రకారం ప్రస్తుతం ఓ వాహనానికి వన్‌టైమ్ పార్కింగ్ చార్జిగా వసూలు చేస్తున్న రూ.4,000ను రూ.6,000కు పెంచుతారు. ఈ చర్య వల్ల ప్రజలు ప్రభుత్వ రవాణా వైపు మరలుతారని, నగరంలో ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించవచ్చని గుప్తా చెప్పారు. ఇరుకైన రోడ్లపై పార్కింగ్ చేసే వాహనాల నుంచి కూడా చార్జీలు వసూలు చేయాలని గుప్తా ప్రతిపాదించారు. సదర్ పహాడ్ గంజ్, కరోల్‌బాగ్ వంటి ప్రాంతాల్లో నాలుగు చక్రాల వాహనానికి రూ.150, ఆటో, టెంపో వంటి వాహనాలకు రూ.100 చార్జీ వసూలు చేయాలని సూచించారు. ఇంటింటి నుంచి చెత్తను పోగు చేస్తున్నందుకు కూడా పన్ను విధించాలని కమిషనర్ ప్రతిపాదించారు. -
మీ యంత్రాంగం పని చేయడం లేదు
పారిశుధ్యం నిర్వహణలో వైఫల్యంపై ఎంసీడీకి హైకోర్టు మొట్టికాయ న్యూఢిల్లీ: రాజధాని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో విఫలమైనందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. నగరంలోని ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతమంది సఫాయి కార్మికులు ఉన్నారు, వారు ఎక్కడ పని చేస్తున్నారో వివరిస్తూ ఓ స్థాయీ నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు బదర్ దుర్రేజ్ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం ఎంసీడీని ఆదేశించింది. ‘‘మీ యంత్రాంగం పని చేయడం లేదు. దీనిపై దృష్టి సారించండి’’ అని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను అందచేయాలని ఎంసీడీ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఆదివారాలు, సెలవు దినాలతో సహా ఢిల్లీలో ప్రతిరోజూ వీధులు, బహిరంగ ప్రదేశాలు, మురుగు కాల్వలు, పార్కులను శుభ్రం చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు గత సెప్టెంబర్ 10న పునరుద్ధరించింది. చరిత్రాత్మకమైన నగరం, భారతదేశ రాజధాని ఢిల్లీప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాలలో ఒకటిగా మారిందంటూ సుప్రీం కోర్టు 1996లో వ్యాఖ్యానించినప్పటికీ, పారిశుధ్యం నిర్వహణలో ప్రభుత్వ సంస్థలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ న్యాయభూమి అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. రోడ్లు ఊడ్చే వ్యక్తి తన విధులకు గైర్హాజరైతే ఎంసీడీ చట్టంలోని 387 సెక్షన్ ప్రకారం మున్సిపల్ మేజిస్ట్రేట్లు 30 రోజుల జైలుశిక్షను విధించవచ్చు. నగరంలోని విద్య, వైద్య సంస్థలు మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, మరుగుదొడ్లు కూడా లేవని స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది శరణ్ పేర్కొన్నారు. నగరంలో పారిశుధ్యాన్ని నిర్వహించేందుకు, పరిస్థితులను మెరుగుపరిచేందుకు సుప్రీం కోర్టు 14 మార్గదర్శకాలను జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. -
నగరంలో 225 డెంగీ కేసులు
న్యూఢిల్లీ: నగరం కాలుష్యకాసారంగా మారిపోయింది. విషజ్వరాలకు నెలవుగా మారింది. రోజురోజుకూ జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన డెంగీ నగర ప్రజలను వణికిస్తోంది. ఒక్క వారంలోనే 200 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో అక్టోబర్ 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు 225 కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్ 11వ తేదీ వరకు 158 కేసులు ఉండగా, ఈ వారం రోజుల్లో కేసులు అత్యధికంగా నమోదైనట్లు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ డెంగీ కేసులు నమోదు అయ్యా యి. ఉత్తర కార్పొరేషన్ పరిధిలో 44 కేసులు, 90 (దక్షిణ కార్పొరేషన్), 37 (తూర్పు), మరో 34 డెంగీ కేసులు నగర శివారు ప్రాంతలల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో, మరో 20 కేసులు సమీప రాష్ట్రాల్లో నమోదు అయ్యాయి. అదేవిధంగా నగరంలో 60 మలేరియా కేసులు కూడా నమోదు అయ్యాయి. కలుషిత జలాల కారణంగా.. నగరంలో కలుషిత జలాల కారణంగా ప్రజలు రోగాల బారినపడుతున్నారు. పశ్చిమ ఢిల్లీలోని శ్రీనగర్‌లో ఉంటున్న రుషి ఖడాఫీ అనే చిన్నారి డెంగీ సోకింది. ఇతడు సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. గత సంవత్సరం నగరంలో 5,500ల డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 6 మంది మృతి చెందినట్లు ఎస్డీఎంసీ రికార్డులు తెలియజేస్తున్నాయి. నగరంలో ఎక్కువగా అంటువ్యాధులు తీవ్రమవుతున్నాయి. ఈ అక్టోబర్ నెలలో అధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. 18వ తేదీ వరకు 105 కేసులు నమోదు అయ్యాయి. దోమల వృద్ధి కేంద్రాలు నగరంలో డెంగీకి కారణమైన దోమల వృద్ధి కేంద్రాలను ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్ ఈ ఏడాది గుర్తించింది. ఇందులో 6 లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో, మూడు ఉత్తర డీఎంసీ పరిధిలోని కేంద్రకార్యాయాల్లో గుర్తించింది. డీడీఏ, ఢిల్లీ సాంకేతిక యూనివర్సిటీ, డీటీసీ, ఇంకా పలు ప్రాంతాలల్లో డెంగీ కారకమైన దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. 2010లో ఢిల్లీలో భారీగా 6,200 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. 2009లో 1,153, 2008లో 1,300, 2011లో 1,131, 2012లో 2,093 కేసులు నమోదు అయ్యాయి. ముందస్తు చర్యలు వర్షాలు రావడానికి ముందు స్థానిక సంస్థలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొన్నాయి. ఈ కారణంగా ఈ ఏడాది ఈ అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ఫాగింగ్ నిర్వహించడం, దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించి, నివారించడం ద్వారా డెంగీని అదుపులోకి తేవడానికి కృషి చేస్తున్నాయి. దోమల వృద్ధికి కారకులైన 1,53,919 మంది ఇళ్ల యజమానులను అధికారులు గుర్తించారు. 1,07,972 మందికి న్యాయపరమై నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో 12,477పై విచారణ కూడా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. -
మా చేతుల్లో ఏమీ లేదు
అనధికార నిర్మాణాలను అడ్డుకోవడంపై కమిషనర్ బస్సి న్యూఢిల్లీ: సంబంధిత విభాగం నుంచి ఉత్తర్వులు వస్తే తప్ప అనధికార నిర్మాణాల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదని నగర పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ చెప్పారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ సర్కులర్‌ను జారీచేశామన్నారు. అక్రమ నిర్మాణాలకు పోలీసులు సహకరిస్తున్నారని, వారి వద్ద నుంచి లంచాలు తీసుకుంటున్నారంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. మున్సిపల్ అథారిటీ నుంచి ఉత్తర్వులు అందినట్టయితే సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అక్రమ నిర్మాణాలను అడ్డుకోగలుగుతారని అన్నారు. పోలీసు శాఖ తాజా సర్కులర్ ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, 1957 చట్టంలోని 475వ నిబంధన కిందఅక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమాచారాన్ని స్టేషన్ హౌజ్ ఆఫీసర్... మున్సిపల్ అధికారులకు అందజేస్తాడు. తన కింద పనిచేసే సిబ్బందిగానీ, అధికారిగానీ ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ యంత్రాంగం నుంచి ఉత్తర్వులు అందగానే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సి ఉంటుందన్నారు. అంతేతప్ప పోలీసులు అడ్డుకోలేరన్నారు. ఒకవేళ అడ్డుకోవాలంటే సంబంధిత అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన వ్యక్తికి సదరు ఉత్తర్వులను చూపాల్సి ఉంటుందన్నారు. అక్రమ నిర్మాణదారులకు తమ సిబ్బంది సహకరించకుండా జాగ్రత్త పడతామన్నారు. తమ సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే అందుకు సంబంధించిన వీడియోగానీ లేదా ఆడియోనుగానీ 9910641064 నంబర్‌కు పంపాలన్నారు. 1064 నంబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఆయన వివరించారు. -
ఆరోగ్య రంగంపై నజీబ్ నజర్
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగం పనితీరు క్రమబద్ధీకరణపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దృష్టి సారించారు. ఆపరేషన్ థియేటర్ల వంటి కీలక విభాగాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేసేందుకుగాను ప్రజాపనుల విభాగంతో సంప్రదింపులు జరిపి తగు వ్యవస్థను రూపొందించాలంటూ ఆరోగ్య శాఖ అధికారులను శుక్రవారం ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలను సమీక్షించారు. అధికారులు ఆస్పత్రుల నవీకరణ, పరిశీలన విషయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) వ్యవహరిస్తున్న తీరును పరిశీలించాలని కోరారు. దీంతోపాటు రోగులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు వీలుగా తగినన్ని అంబులెన్సు సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆస్పత్రికి చేరిన రోగికి సకల సదుపాయాలు ఉండేవిధంగా చూడడంతోపాటు వారికి తక్షణమే అవసరమైన సేవలు అందేవిధంగా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర విభాగంలో వైద్యులతోపాటు సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యసవర సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పందిస్తూ నగరంలోని 36 ఆస్పత్రులు ఎంతో బాగా సేవలందిస్తున్నాయన్నారు. తరచూ వీటిని తనిఖీ చేసేందుకుగాను ఎనిమిది బృందాలను నియమించామన్నారు. డిస్పెన్సరీలను సైతం తరచూ తాము తనిఖీ చేస్తున్నామన్నారు. ఔట్ పేషంట్ విభాగాల (ఓపీడీ) వద్ద రోగులు బారులు తీరే పరిస్థితి రాకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా మందుల కొరత సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. -
కూల్చివేతలు షురూ
న్యూఢిల్లీ:లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో దేశ రాజధానిలో అక్రమకట్టడాల కూల్చివేత పునఃప్రారంభమైంది. ఇందులోభాగంగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) 50 భవనాలను తాజాగా నేలమట్టం చేసింది. మరో 300 భవనాల కూల్చివేతకు నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. సదర్‌బజార్ జోన్లోనే 30 అక్రమ కట్టడాలను కూల్చివేయడంతోపాటు... ఒక భవనాన్ని సీజ్ చేసినట్టు ఎన్ఎండీసీ పీఆర్ఓ యోగేంద్ర సిన్హా మన్ తెలిపారు. రోహిణి జోన్లో మరో 12 భవనాలను నేలమట్టం చేయడమే కాకుండా మరో భవనాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. సిటీ జోన్లో కేవలం ఆరు కట్టడాలనే కూల్చేసినట్టు చెప్పారు. ఎన్నికల నియమావళి, సిబ్బంది కొరత వల్ల కూల్చివేతల్లో ఇంకా జాప్యం జరుగుతోందని, కూల్చివేత ప్రక్రియలో పాల్గొనాల్సిన సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడంతో సరైన సమయంలో చేయలేకపోతున్నామని ఆయన అన్నారు. కొన్ని రోజుల కిందట వాజీపూర్ పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన కూల్చివేతలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. సిటీజోన్లోని అజ్మీరీ గేట్, చాందినీచౌక్, దరియాగంజ్, రోహిణి జోన్, పీతమ్‌పుర, పశ్చిమ్‌విహార్, శాలిమార్ బాగ్తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో నిబంధనలు అతిక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేసినట్టు తెలిపారు. పశ్చిమ్ విహార్‌లోని ఓ స్కూల్లో సగభాగాన్ని కూడా సీలింగ్‌లో భాగంగా కూల్చివేశామని ఆయన వివరణ ఇచ్చారు. ద క్షిణఢిల్లీ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లలో ప్రమాదక ర కట్టడాలను పర్యవేక్షించే వర్షాకాలపు సర్వే జూన్ వరకు కొనసాగుతుందని మన్ తెలిపారు. అత్యంత ప్రమాదకర కట్టడాల తొలగింపునకు వెంటనే నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే కూల్చివేతలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కొందరు సిబ్బందిని ప్రతిఘటించడంతో పోలీసుల సాయం తీసుకోవాల్సిన వచ్చిందని సీనియర్ మున్సిపల్ అధికారి ఒకరు అన్నారు. ప్రమాదకర భవనాల గుర్తింపునకు సర్వే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమాదకర లేదా శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి కూల్చేయడానికి తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) సర్వే నిర్వహించనుంది. జూన్ 15 నాటికి సర్వే ముగించాలని, దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ , ఫిట్టింగ్ పనులను 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని కార్పొరేషన్ సంబంధిత విభాగాలను ఆదేశించింది. ‘ప్రమాదకర, మరమ్మతులకు అనువుగా ఉన్న భవనాలను గుర్తించడానికి అన్ని ప్రాంతాల్లో తిరిగి సర్వే నిర్వహిస్తాం. అన్ని మున్సిపాలిటీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఉద్యోగుల క్వార్టర్లు, కార్యాలయాల భవనాలను తనిఖీ చేస్తాం. వీటి పైపులను కూడా పరిశీలించి శుభ్రపరుస్తాం. ఫలితంగా వర్షపు నీరు సాఫీగా డ్రైనేజీల్లోకి వెళ్తుంది’ అని కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏదైనా ఇళ్లు మరమ్మతునకు అనువుగా లేదని తేలితే.. దానిని తొందర్లేనే కూల్చివేస్తారు. సర్వేకు సంబంధించి వారం వారీగా నివేదికలు తయారీ చేసి సంబంధిత జోనల్ కార్యాలయాలకూ పంపిస్తారు. సర్వే నిర్వహణ కోసం ప్రతి జోన్‌కూ ఒక వాహనాన్ని, కార్మికులను కేటాయిస్తారు. ‘మరమ్మతులు చేయడానికి ఉపయోగపడే పరికరాలనూ కూడా సంబంధిత విభాగాలకు పంపిస్తాం. దీనివల్ల వర్షాకాలంలోనూ సులువుగా మరమ్మతులు నిర్వహించవచ్చు. పాత ఢిల్లీలో పురాతన భవనాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి భవనాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ప్రమాదకరమని గుర్తిస్తే తక్షణం ఖాళీ చేయాల్సిందిగా భవన యజమానులను ఆదేశిస్తున్నాం.’ అని ఈడీఎంసీ వర్గాలు తెలిపాయి. జూన్ 15 కల్లా అన్ని మురుగుకాల్వల్లో పూడిక తొలగింపును పూర్తి చేయాలని పారిశుధ్య విభాగాన్ని కూడా తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేతకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మరో అధికారి తెలిపారు. -
‘చెత్త’శుద్ధి ఏది?
న్యూఢిల్లీ: రాజధాని నగరాన్ని శుభ్రంగా ఉంచేం దుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఏమీ చేయడం లేదని హైకోర్టు మండిపడింది. ఢిల్లీలోని ప్రతి మూలను శుభ్రం చేయాలని ఆదేశించింది. నగర అపరిశుభ్రతకు ఎంపీలను, ఎమ్మెల్యేలను నిం దిస్తారని, కానీ అది పురపాలక సంస్థ బాధ్యత అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓఖ్లా ఇండస్ట్రియల్ ప్రాంతానికి చెందిన కొందరు వీధి వ్యాపారులు దాఖలుచేసిన ఓ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, జస్టిస్ ఎస్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఓఖ్లా ప్రాంతమంతా అపరిశుభ్రం గా, చెత్తతో నిండి ఉందని, దానిని శుభ్రపరిచేం దుకు ఎంసీడీ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ ప్రాంతంలో ఏయే నిర్మాణాలు చేపట్టదలచుకున్నారో వివరిస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని ఎంసీడీని ఆదేశిం చింది. అలాగే ఆ ప్రాంతంలో చెత్తను తొలగించేందుకు తీసుకోనున్న చర్యలు, దోమల నిర్మూలనకు అనుసరించే ప్రణాళికపై కూడా వివరించాలని ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన సమస్యలకు సంబంధించి స్థాయీ నివేదికను కూడా జతచేయాలని కోరింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసిన కోర్టు అప్పటికి ఢిల్లీ పోలీసులు కూడా ఒక స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.తాము గౌరవంగా తమ విధులను నిర్వహించాలనుకుంటున్నామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇందిరా ఉన్నినాయర్ తమ వాదనలు వినిపిస్తూ ఓఖ్లా ప్రాం తమంతా రోతగా, దోమలమయంగా ఉందని తెలి పారు. చెత్తను తొలగించడంతో పాటు అక్కడ వ్యాపారులకు, ప్రజలకు ఉపయోగపడేలా మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. దీనిని ఎంసీడీ సమాధానమిస్తూ, వెంటనే తాము ఆ ప్రాంతాన్ని శుభ్రపరుస్తామని, మరుగుదొడ్లు కూడా నిర్మిస్తామని తెలిపింది. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘కట్టండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? మీరు ఏమి కట్టాలనుకుంటున్నారో ముందుగా మాకు చూపండి. అవసరమైతే మేము అందుకు అనుమతి నిస్తాం’ అని పేర్కొన్నారు. వీధి వ్యాపారులను అడ్డుకోరాదని, అది వారి హక్కు అని హైకోర్టు గత జనవరి 16న ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను అటు పోలీసులు, ఇటు మున్సిపల్ అధికారులు ఖాతరు చేయడం లేదని ఆరోపిస్తూ హాకర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాము వ్యాపారాలు చేసుకోకుండా ఎంసీడీ తమ చుట్టూ చెత్తను పోగు చేస్తోందని వారు ఆరోపిం చారు. తాము ప్రశాంతంగా తమ నిరసనను తెలియచేస్తే, తమపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. దీనిపై కోర్టు ఈ నెల 12న ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు, మరో 37 మంది ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది. -
సగటుజీవికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సామాన్యులకు ఊరటని చ్చేందుకే ఈ ఏడాది ఎంసీడీల పరిధిలోని పార్కింగ్ రేట్లు, హౌసింగ్ ట్యాక్స్‌లు పెంచకూడదని నిర్ణయించినట్టు బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం పండిత్ పంత్‌మార్గ్‌లోని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ కార్యాలయంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఎంసీడీల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోయల్ మాట్లాడారు. ఎంసీడీల పనితీరులో పారదర్శకత పెంచడంతోపాటు ప్రజలకు మరింత చేరువ య్యేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే బీజేపీ అధికారంలో ఉన్న ఎంసీడీల పరిధిలోని పార్కింగ్ రేట్లు, హౌసింగ్ ట్యాక్స్‌లు పెంచడం లేదన్నారు. హోటళ్లు, బంక్వెట్ హాళ్లుగా మార్చిన ఫామ్ హౌస్‌ల విషయంలో కొద్దిమేర మార్పులు చేసినట్టు తెలిపారు. వీటన్నింటి వివరాలు ఆన్లైన్లో పొం దుపరుస్తున్నట్టు తెలిపారు. ఎంసీడీల పరిధిలో తీసుకోబోయే నిర్ణయాలను వివరించారు. కమ్యూనిటీహాళ్లు బుకింగ్‌తోసహా 64 అంశాలకు సంబంధించిన చెల్లింపులు, ఇతర అంశాల వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ స్కీం(ఈసీఎస్) ద్వారా కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తారు. ఈసీఎస్ ద్వారానే ఎంసీడీ ఉద్యోగుల జీతభత్యాలను కూడా చెల్లిస్తారు. చారిత్రక ప్రదేశాలపై ప్రాపర్టీ ట్యాక్స్‌ను తొలగిస్తారు. ఎయిడెడ్ పాఠశాలలపై ప్రాపర్టీ ట్యాక్స్‌ను తగ్గిస్తారు.